శ్రీనిధి శెట్టికి అంత సీన్ లేదంట
ABN, Publish Date - Oct 09 , 2026 | 10:08 PM
ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా తరువాత హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచడం సాధారణమే. ముఖ్యంగా హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయితే.. మరో సినిమాకి పారితోషికం డబుల్ చేసేస్తూ ఉంటారు.
ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా తరువాత హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచడం సాధారణమే. ముఖ్యంగా హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయితే.. మరో సినిమాకి పారితోషికం డబుల్ చేసేస్తూ ఉంటారు. తాజాగా కేజీఎఫ్ ఫ్రాంచైజీతో పాన్-ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని, యష్ సరసన మెరిసిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కూడా రెమ్యూనరేషన్ పెంచేసిందని టాక్ నడుస్తోంది. ఈ చిన్నది ఒక్కో సినిమాకు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఏంటి.. ఆమె తీసింది కొన్ని సినిమాలే. తెలుగులో అయితే హిట్ తరువాత కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. అప్పుడే ఒక్కో సినిమాకి రూ. 8 కోట్లు డిమాండ్ చేస్తుందా అని నెటిజన్స్ నోళ్లు వెళ్లబెడుతున్నారు.
అయితే తాజాగా భారీ పారితోషికం వార్తలపై శ్రీనిధి స్పందించింది. అవన్నీ కేవలం అవాస్తవాలని, తనకంత సీన్ లేదని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటివరకు చాలా తక్కువ చిత్రాల్లో మాత్రమే నటించానని, అలాంటప్పుడు అంత భారీ మొత్తాన్ని పారితోషికంగా ఎలా డిమాండ్ చేయగలనని ప్రశ్నించింది. కేవలం డబ్బు సంపాదించడమే తన ప్రధాన లక్ష్యమైతే, ఈపాటికే కనీసం 20 సినిమాలు చేసి ఉండేదాన్నని, తనకు డబ్బు కంటే ఒక నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే ముఖ్యమని తేల్చిచెప్పింది. పాన్-ఇండియా సక్సెస్ వచ్చినా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయడానికి కారణం సరైన కథలను ఎంచుకోవడమేనని తెలిపింది.
మంచి కంటెంట్ ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని శ్రీనిధి స్పష్టం చేసింది. తక్కువ పారితోషికం వచ్చినా సరే మంచి ప్రాజెక్ట్‌లలో భాగం కావడానికే ఇష్టపడతానని చెప్పి ఈ రూమర్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం శ్రీనిధి.. వెంకటేష్ సరసన ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావల్సి ఉండగా కొన్ని కారణాల వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో శ్రీనిధి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.