Srinath Maganti : విమర్శలకు నటనతో సమాధానమిచ్చిన శ్రీనాథ్ మాగంటి
ABN, Publish Date - Nov 23 , 2026 | 01:56 PM
ENE Repeatలో కార్తీక్ పాత్రతో శ్రీనాథ్ మగంటి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మొదట్లో ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆయన తన నటనతో విమర్శకులను మెప్పించారు.
‘‘ఈ నగరానికి ఏమైంది-2’లో నా నటన నచ్చకపోతే కార్తీక్ పాత్ర కోసం మరో నటుడిని తీసుకుంటామని ముందే చెప్పారు. కానీ ఇప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో నేనూ ఒక భాగమయ్యాను. ఇదే నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు’’ అని శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti) అన్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో కార్తీక్ పాత్రకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ పాత్రలో సాయి సుశాంత్ రెడ్డి నటనకు ఎంతోమంది అభిమానులయ్యారు. అలాంటి పాత్రలో శ్రీనాథ్ మగంటిని తీసుకుంటున్నట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. పాత కార్తీక్ స్థానంలో కొత్త నటుడిని ఊహించుకోవడానికి అభిమానులు మొదట్లో ఆసక్తి చూపించలేదు. సుశాంత్ వ్యక్తిగత కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు ఈ పాత్ర కోసం మరో నటుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ శ్రీనాథ్ మగంటిని ఎంపిక చేశారు. అయితే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో శ్రీనాథ్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఆయన విమర్శలు, ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్లో అడుగుపెట్టారు.
షూటింగ్ మొదటి రోజే తనకు అసలైన పరీక్ష ఎదురైందని శ్రీనాథ్ వెల్లడించారు. తన నటన నచ్చకపోతే మరో నటుడిని తీసుకోవడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉందని చెప్పారు. దీంతో గతంలో సాయి సుశాంత్ చేసిన నటనను అనుకరించకుండా, కార్తీక్ పాత్రలోని అసలు భావోద్వేగాలను అర్థం చేసుకుని నటించడంపై దృష్టి పెట్టారు. పాత్రకు ఉండే ప్రత్యేకమైన హావభావాలు, స్నేహితులతో ఉండే అనుబంధాన్ని కొనసాగిస్తూనే తనదైన శైలిని జోడించారు.ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. ముఖ్యంగా విశ్వక్ సేన్, అభినవ్ గోమఠంతో ఆయన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివాత్మిక రాజశేఖర్‌తో ఉన్న సన్నివేశాల్లోనూ భావోద్వేగాలను చక్కగా పండించారు. కామెడీ, యాక్షన్, డ్రామా ఇలా అన్ని కోణాల్లోనూ తన నటనతో మెప్పించారు. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే శ్రీనాథ్‌పై ఉన్న విమర్శలు తగ్గి, ఆయన నటనపై ఆసక్తి పెరిగింది. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ స్పందన తనకు ఎంతో ప్రత్యేకమని శ్రీనాథ్ తెలిపారు. ‘
‘నా నటన నచ్చకపోతే కార్తీక్ పాత్ర కోసం మరో నటుడిని తీసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో నేనూ ఒక భాగమయ్యాను. ఇదే నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు’’ అని చెప్పుకొచ్చారు.ఇంతకుముందు ‘హిట్’, ‘యానిమల్’ వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన శ్రీనాథ్ మాగంటికి ‘ENE Repeat’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఒకప్పుడు ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీనాథ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.