Medha Meka: శ్రీకాంత్ కూతురు ఏంట్రా.. ఇంత క్యూట్ ఉంది..
ABN, Publish Date - Nov 09 , 2026 | 05:06 PM
సాధారణంగా ఇండస్ట్రీలోకి ఏ కొత్త హీరోయిన్ వచ్చినా .. తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు . అలాంటింది.. అచ్చ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయమవుతుంటే ఆగుతారా.. కొత్త క్రష్ లిస్ట్ లోకి తోసెయ్యరు. తాజాగా ఆ లిస్ట్ లో చేరిన అందాల కుందనపు బొమ్మ మేధా మేక (Medha Meka)
సాధారణంగా ఇండస్ట్రీలోకి ఏ కొత్త హీరోయిన్ వచ్చినా .. తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు . అలాంటింది.. అచ్చ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయమవుతుంటే ఆగుతారా.. కొత్త క్రష్ లిస్ట్ లోకి తోసెయ్యరు. తాజాగా ఆ లిస్ట్ లో చేరిన అందాల కుందనపు బొమ్మ మేధా మేక (Medha Meka). సీనియర్ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ ఊహ దంపతుల కుమార్తెగా ఆమె వెండితెరకు పరిచయం అవుతుండటంతో టాలీవుడ్లో సరికొత్త సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మైత్రి ఇన్ లవ్ (Mythri In Love) అనే అందమైన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ద్వారా ఆమె కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తుండగా, జై జస్తి (Jai Jasti) హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే పూజా కార్యక్రమాల్లోనే తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించిన మేధా, తాజాగా దీపావళి పండుగ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ రంగు చుడీదార్లో ఎంతో సింపుల్‌గా, ట్రెడిషనల్ లుక్‌లో కనిపించిన మేధా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. భారీ మేకప్‌కు తావివ్వకుండా చాలా న్యాచురల్ లుక్‌లో కనిపించడంతో కుర్రకారు ఈ శ్రీకాంత్ తనయను టాలీవుడ్ న్యూ క్రష్ లిస్ట్ లో యాడ్ చేసేశారు. మేధా పోస్ట్ చేసిన ఈ పిక్స్ కి నెటిజన్లు , ఫ్యాన్స్ నుంచి ఊహించని రేంజ్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ కూతురు ఏంట్రా.. ఇంత క్యూట్ ఉంది అని కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఈమధ్యనే ఒక క్రేజీ సీక్వెల్ లో మేధా హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది తన న్యాచురల్ లుక్స్‌తో కుర్రకారు మనసు దోచుకుంటూ జెన్-జీ ఫేవరెట్‌గా మారిపోయింది. మరి స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇస్తున్న మేధా మేక తన మొదటి సినిమాతోనే టాలీవుడ్లో ఏ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.