సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ట్రెడిషనల్ లుక్‌లో శ్రీలీల‌.. పిచ్చోల్ల‌వుతున్న ఫ్యాన్స్‌

ABN, Publish Date - Nov 27 , 2026 | 09:23 AM

అచ్చ తెలుగందం శ్రీలీల గురువారం హైద‌రాబాద్‌లో సంద‌డి చేసింది. త‌న అందంతో చూప‌రుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను గావించింది.

sreeleela

సినీనటి శ్రీలీల ( Sreeleela) గురువారం హైద‌రాబాద్‌లో సంద‌డి చేశారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఓ సిల్క్ షోరూంను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం షోరూంలోని వివిధ రకాల చీరలను శ్రీలీల ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉందని, చీరలు మహిళల అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చీరల డిజైన్లలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయని, సంప్రదాయాన్ని కాపాడుతూనే ఆధునికతను జోడించడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. భారతీయ వస్త్రకళను ప్రోత్సహిస్తూ కొత్త తరానికి చేరువ చేసే ఇలాంటి ప్రయత్నాలు అభినందనీయమని అన్నారు.

కాగా.. సంప్రదాయ చీరకట్టులో అందంగా మెరిసిన శ్రీలీల ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ చీరలో శ్రీలీల మెరిసిపోయారు. చీరకు ఉన్న ఎమరాల్డ్ గ్రీన్ బోర్డర్, దానిపై అందంగా రూపొందించిన గోల్డ్ జరీ వర్క్ ఆమె లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. దీనికి జతగా డీప్ గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించారు. స్టేట్‌మెంట్ గోల్డ్ జుంకాలు, అందమైన ఇయర్ కఫ్, చిన్న బిందీతో మెరిసిపోయారు. ట్రెడిషనల్ ఎలిగెన్స్‌కు మోడ్రన్ ఫ్యాషన్ టచ్ జోడించిన ఆమె లుక్ అభిమానులను ఇట్టే క‌ట్టి ప‌డేసింది. అక్క‌డికి వ‌చ్చిన వారి చూపులు తిప్పుకోనివ్వ‌కుండా త‌న న‌వ్వు, అందంతో మెస్మ‌రైజ్ చేసింది.

శ్రీలీల రాకతో షోరూం ప్రాంగణంలో సందడి నెలకొంది. తమ అభిమాన నటి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఏగ‌బ‌డ్డారు. అభిమానులకు అభివాదం చేస్తూ శ్రీలీల సందడి చేశారు. దీంతో షోరూం ప‌రిస‌రాల్లో జాత‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌స్త‌తుం ఈ కార్య‌క్ర‌మంలో పాల్లోన్న శ్రీలీల‌కు సంబంధ‌ఙంచిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Nov 27 , 2026 | 09:23 AM