Sreeleela: త్వరలోనే.. చాలా గుడ్ న్యూస్‌లు చెబుతా
ABN, Publish Date - Nov 22 , 2026 | 11:01 AM
సినిమాలతో బిజీగా ఉంటూనే కొత్త రంగాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.
'మొన్నమొన్నటిదాకా చదువు. సినిమాలతో బిజీగా ఉన్నా ఇప్పుడు కూడా. అప్పుడంత బిజీ కావాలని ప్రయత్నిస్తున్నా. త్వరలోనే వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతా" అని శ్రీలీల (Sreeleela) తెలిపింది. ఆమె నటించిన ఓమ్ ( O.M) శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో పిల్లాడికి తల్లిగా, ధనుష్‌కి ఇల్లాలిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది.
'ఓమ్'కి తెలుగులో అనుకున్నంత స్పందన రావడం లేదు. అయితే ఈ చిత్రాన్ని చెన్నైలో చూసిన శ్రీలీల మాట్లాడుతూ. మంచి రోల్ చేశాను రజనీకాంత్ గారితో నటించాలనే నా కల త్వరలోనే నెరవేరబోతోందని అన్నారు. తదుపరి కార్యాచరణ గురించి చెబుతూ 'త్వరలోనే స్కిన్ కేర్ బ్రాండ్‌ను మొదలుపెడతానన్నారు. మెడిసిన్‌లో పీజీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నా అని భవిష్యత్తులో ఇంకా చాలా చేయాలని ఉంది' అని అన్నారు.