సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నందమూరి మోక్షజ్ఞకి హీరోయినే దొరకడం లేదా..

ABN, Publish Date - Nov 02 , 2026 | 09:42 PM

నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) తొలి సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది.

Nandamuri Mokshagna

నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) తొలి సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్ మారుతూనే వచ్చారు. చివరికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ ఫిక్స్ అయినా కూడా ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. దానికి కారణం ఏంటి అంటే.. మొన్నటివరకు డైరెక్టర్స్ ఛేంజ్ అయ్యారు. కానీ, ఇప్పుడు హీరోయిన్ ఎంపిక కూడా ఈ ప్రాజెక్ట్‌కి మరో ప్రధాన అడ్డంకిగా మారినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


ఫస్ట్ ఈ సినిమా కోసం సీనియర్ నటుడు శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధా మేకను కూడా హీరోయిన్ గా పరిచయం చేయాలని అనుకున్నారట. మోక్షజ్ఞతో మేధా రొమాన్స్ అని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మైత్రీ ఇన్ లవ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో మళ్లీ మోక్షజ్ఞ సినిమా మొదటికి చేరుకుంది.మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి క్రేజ్ తీసుకురావడం కోసం ఒక స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు.


ఇక మేధా తరువాత మోక్షుతో అందాల భామ రాషా తడానీ నటిస్తోందని వార్తలు వచ్చాయి. రాషాని కూడా మోక్షు సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో శ్రీనివాస కళ్యాణంకి ఎస్ చెప్పింది. ఘట్టమనేని జయకృష్ణతో పాటు టాలీవుడ్ కి రాషా కూడా పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా.. రాషా అందానికి ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. అలా మోక్షు సరసన రాషా కూడా తప్పుకుంది. ఇక ఇప్పుడు మోక్షుతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరు అంటే క్రేజీ హీరోయిన్ శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా హిట్ కోసం సతమతమవుతోన్న శ్రీలీలకి ఈ సినిమా గోల్డెన్ ఛాన్స్ లాంటింది. మరి ఈ ఆఫర్ ని అమ్మడు అందుకుంటుందా.. లేదా అనేది చూడాలి.

Updated Date - Nov 02 , 2026 | 09:48 PM