సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్..

ABN, Publish Date - Oct 30 , 2026 | 02:05 PM

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), మహిమా నంబియార్ జంటగా జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'కామ్రేడ్ కళ్యాణ్' (Comrade Kalyan). శ్రీవిష్ణు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనుకున్న ప్రేక్షకులు భారీ అంచనాలతో అక్టోబర్ 9 న థియేటర్ కి వెళ్లారు.

Comrade Kalyan

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), మహిమా నంబియార్ జంటగా జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'కామ్రేడ్ కళ్యాణ్' (Comrade Kalyan). శ్రీవిష్ణు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనుకున్న ప్రేక్షకులు భారీ అంచనాలతో అక్టోబర్ 9 న థియేటర్ కి వెళ్లారు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో మేకర్స్ ఎలాంటి హడావిడి లేకుండా ఈ చిత్రాన్ని ఓటీటీలోకి దించారు. కామ్రేడ్ కళ్యాణ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ శుక్రవారం నుంచి ఈ మూవీ అమెజాన్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.


సాధారణంగా ఒక సినిమా ఓటీటీకి వస్తోంది అంటే ముందు చాలా హడావిడి ఉంటుంది. పోస్టర్స్, వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం, మేకర్స్ అధికారికంగా ఓటీటీలోకి వస్తుంది అని చెప్పడం, ప్రమోషన్స్ ఇలా చాలా చేస్తారు. కానీ, కామ్రేడ్ కళ్యాణ్ మాత్రం సైలెంట్ గా ఓటీటీకి వచ్చి సర్ ప్రైజ్ చేశాడు. నెల కూడా తిరక్కుండానే ఓటీటీలోకి అడుగుపెట్టి షాక్ ఇచ్చాడు. అయినా సరే శ్రీవిష్ణు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడం విశేషం.


ఇక కథ విషయానికొస్తే.. ఈ కథ 1992వ సంవత్సరంలో, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. కల్యాణ్ (శ్రీవిష్ణు) ఆ ఊరిలో నష్టాల్లో నడుస్తున్న ఒక పాత సినిమా థియేటర్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని తాపత్రయపడే సాధారణ యువకుడు. అదే సమయంలో, అతను సితార (మహిమా నంబియార్) అనే ఒడిశా అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సితార కుటుంబాన్ని ఆదుకోవడానికి, తన థియేటర్ గట్టెక్కడానికి కల్యాణ్ రకరకాల తిప్పలు పడుతుంటాడు. ఆ ప్రాంతంలో అప్పట్లో బలంగా ఉన్న కమ్యూనిస్ట్, నక్సల్ భావజాలాన్ని తన స్వార్థానికి, కామెడీ పనులకు వాడుకోవడం మొదలుపెడతాడు. అయితే కల్యాణ్ చేసే కొన్ని అమాయకపు, క్రేజీ పనుల వల్ల స్థానిక పోలీసులు అతన్ని ఒక ప్రమాదకరమైన నక్సలైట్ నాయకుడిగా తప్పుగా అర్థం చేసుకోవడంతో రాత్రికి రాత్రే కల్యాణ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి ఎక్కుతాడు. ఆ తరువాత ఏం జరిగింది..? ఐపీఎస్ ఆఫీసర్ జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో), నక్సల్స్ దళ కమాండర్ మాస్టర్ (సాయి చంద్) మధ్యలో అన్యాయంగా ఇరుక్కున్న కల్యాణ్, తన స్నేహితుడు, దుబాయ్ బాబు ఎలా బయటపడ్డారు? పోలీసులను, నక్సలైట్లను ఎలా బురిడీ కొట్టించాడు? చివరికి తన ప్రేమను, థియేటర్‌ను ఎలా దక్కించుకున్నాడు? అనేదే మిగిలిన కథాంశం. థియేటర్ లో అంతగా హిట్ దక్కని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 30 , 2026 | 02:19 PM