సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కామ్రేడ్ కళ్యాణ్.. నవ్వి నవ్వి చంపేలా ఉన్నారుగా

ABN, Publish Date - Sep 05 , 2026 | 05:50 PM

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు (Sree Vishnu) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

Comrade Kalyan

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు (Sree Vishnu) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan). జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో శ్రీవిష్ణు ఒక నక్సలైట్‌గా, విప్లవ భావాలు కలిగిన కామ్రేడ్ కళ్యాణ్ పాత్రలో కనిపించాడు. టైటిల్ చూసి శ్రీవిష్ణు బాగా సీరియస్ గా ఉండే పాత్రలో కనిపిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ టీజర్ మొదట్లోనే నక్సలైట్ అంటే నక్సల్ చేతిలో లైట్, కమ్యూనిజం అంటే ఏంటి.. కమ్యూనిస్టులు చెప్పే నిజం అంటూ చెప్పే డైలాగ్స్ తోనే ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ అని అర్ధమైపోయింది. ఇక టీజర్ మొత్తం నవ్వులతో ముంచేశారు. సత్యతో కలిసి శ్రీవిష్ణు పండించిన కామెడీ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.విప్లవాత్మక నేపథ్యంతో పాటు శ్రీవిష్ణు మార్క్ కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.


ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మహిమా నంబియార్ అందం సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్ బాలయ్య ఫ్యాన్ గా కనిపించింది. టీజర్ తోనే సినిమాపై ఒక రేంజ్ లో హైప్ పెంచేశారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 9న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Sep 05 , 2026 | 05:59 PM