శ్రీవిష్ణు.. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ టీజర్
ABN, Publish Date - Feb 12 , 2026 | 11:16 AM
హీరో శ్రీవిష్ణు తన పంథా మార్చి నటించిన సినిమా ‘మృత్యుంజయ్’ టీజర్ బుధవారం దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు.
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా గుర్తింపును సంపాదించుకుని ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) కొంత గ్యాప్ తర్వాత తన పంథా మార్చి నటించిన సినిమా ‘మృత్యుంజయ్’ (Mrithyunjay). ఫిబ్రవరి 27న థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు ఫస్ట్ టైం తన శైలికి భిన్నంగా మిస్టరీ థ్రిల్లర్‌తో రానుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.