సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Spirit: స్పిరిట్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అదేనా

ABN, Publish Date - May 04 , 2026 | 07:37 PM

బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు.. దాని కోసం కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురచూస్తుంటారు.

Spirit

Spirit: బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు.. దాని కోసం కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురచూస్తుంటారు. ప్రస్తుతం డార్లింగ్ లైనప్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో అత్యంత క్రేజీ మూవీ ఏదంటే.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.


నిజానికి స్పిరిట్ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రాథమికంగా భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ తేదీకి సినిమా రావడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభాస్ చేతిలో ఉన్న ఇతర భారీ ప్రాజెక్టులే. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ ఆశించిన వేగంతో సాగడం లేదు. దాదాపు 30 శాతం షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. దీనితో పాటు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి 2898 AD సీక్వెల్ కల్కి-2 పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల పోర్షన్స్‌ను పూర్తి చేశారు. త్వరలోనే ప్రభాస్ ఈ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.


ఇక ఇన్ని భారీ చిత్రాల మధ్య సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించడం కొంత ఇబ్బందిగా మారింది. గతంలోనే సందీప్ ఈ సినిమా కోసం ప్రభాస్ నుంచి భారీగా కాల్షీట్లు తీసుకున్నప్పటికీ, పాత సినిమాల బాకీలు తీర్చకుండా కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించడం సాధ్యం కావడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సందీప్ వంగా ఒక కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. స్పిరిట్ ని వాయిదా వేసి.. తమకు అచ్చొచ్చిన డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.


అటు సందీప్ రెడ్డి వంగాకు, ఇటు ప్రభాస్‌కు డిసెంబర్ నెల బాగా కలిసి వచ్చింది. డిసెంబర్‌ 1, 2023న రిలీజైన యానిమల్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అందుకోవడమే కాకుండా దాదాపు 800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. ఇప్పుడు స్పిరిట్‌ సినిమాను కూడా అదే నెలలో రిలీజ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా ప్రభాస్‌ నటించిన సలార్‌ పార్ట్‌ 1 కూడా డిసెంబర్‌లోనే రిలీజై గ్రాండ్‌ హిట్‌ అందుకుంది. ఇలా ఒకే నెలలో రెండు సెంటిమెంట్స్‌ ఉండడంతో స్పిరిట్‌కు డిసెంబర్ మంచి సీజన్‌ అని భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Updated Date - May 04 , 2026 | 07:45 PM