సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వార‌ణాసిలో.. స్పెషల్ ఐటమ్ నంబర్! థియేటర్లు.. దద్దరిల్లడం ఖాయం

ABN, Publish Date - Apr 07 , 2026 | 03:31 PM

వారణాసి సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్స్ వింటుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.

varanasi

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) నుంచి ఒక సినిమా వస్తోందంటే అది కేవలం సినిమా కాదు, ఒక వెండితెర అద్భుతం. ఇక ఆ అద్భుతానికి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తోడైతే? బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాయాల్సిందే!. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'వారణాసిస (Varanasi). ఈ సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్స్ వింటుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ ప్రత్యేక సెట్‌లో శరవేగంగా జరుగుతోంది. రాజమౌళి విజన్ అంటేనే గ్రాండియర్.. దానికి తగ్గట్టుగానే ఈ సెట్ డిజైన్ ఉందట. చాలా మందికి ఇవేళ ఎరుకైన సంగతేమిటంటే, ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా డ్రామా, ఎమోషన్ పీక్స్‌లో ఉండే సీన్స్ ఇవని టాక్.

ఈ సినిమాలో మహేష్ బాబు మేకోవర్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి 'రుద్ర' అనే మాస్ అండ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కాగా, మరొకటి 'శ్రీరాముడు'గా కనిపించబోతున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సీన్స్ 'రుద్ర - మందాకిని' జోడికి సంబంధించినవి అని తెలుస్తోంది. మహేష్ బాబును రాజమౌళి ఏ స్థాయిలో చూపించబోతున్నారో టీజర్‌తోనే క్లారిటీ వచ్చేసింది.

అయితే ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే ఒక భారీ సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశారట జక్కన్న. ఇది సాధారణ పాట కాదు, ఒక స్పెషల్ ఐటమ్ నంబర్ అని సమాచారం. ఈ పాటలో మహేష్ సరసన స్టెప్పులు వేయడానికి ఒక బాలీవుడ్ టాప్ బ్యూటీని రంగంలోకి దించుతున్నారు. అలాగే ఈ పాట కోసం వేస్తున్న సెట్ ఖరీదే కోట్లల్లో ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఎం.ఎం. కీరవాణి అదిరిపోయే ట్యూన్ ఇచ్చారని, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు, అంటే విజువల్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతోంది. విజయేంద్ర ప్రసాద్ కథ, దేవా కట్టా పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయి.

టీజర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన 'వారణాసి', థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తోడవడంతో ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Apr 07 , 2026 | 03:31 PM