నీలవే.. ట్రైలర్! ముద్దులతో.. ముంచెత్తారుగా
ABN, Publish Date - Feb 09 , 2026 | 01:34 PM
సౌమిత్, శ్రేయసి సేన్ నూతన జంట హీరోహీరోయిన్లుగా రూపొందిన రొమాంటిక్ లవ్ స్టోరి చిత్రం నిలవే.
సౌమిత్ (Sowmith Poladi), శ్రేయసి సేన్ (Shreyasi Sen) నూతన జంట హీరోహీరోయిన్లుగా రూపొందిన రొమాంటిక్ లవ్ స్టోరి చిత్రం నిలవే (Nilave). గిరిధర్ పోలాడి, సాయి, రాజ్ అల్లాడ నిర్మించిన ఈ చిత్రానికి సౌమిత్, వెన్నం సాయి సంయుక్తంగా దర్శకత్వం చేశారు. హర్ష చెముడు (Harsha Chemudu), సుప్రియ (Supriya Aysola) కీలక పాత్రలు చేశారు. పూర్తి యూత్ లవ్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రేక్షకులకు ఎదుటకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ యూత్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇద్దరు లవర్స్ గాఢమైన ప్రేమలో ఉండడం, వారిరువురి మధ్య విభేదాలు వచ్చి వేరు పడడం ఆపై ప్రేయసి కోసం ప్రియుడి ఆరాటం నేపథ్యంలో సినిమా సాగినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మధ్యలో గాఢమైన ముద్దులతో, టేకింగ్‌తో అర్జున్ రెడ్డి సినిమాను ఫాలో అయినట్లు తెలుస్తోంది. మీరూ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి మరి.