సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిత్రసీమ మనుగడ కోసం ప్రదర్శనదారులు కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Mar 12 , 2026 | 11:21 PM

చిత్రసీమ బాగుకోసం- జనాన్ని థియేటర్స్ కు రప్పించడానికి నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు... బుధవారం బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియా ఎగ్జిబిటర్స్ మీట్ లో ఈ డెసిషన్స్ పై చర్చ సాగింది...

చిత్రసీమ బాగుకోసం- జనాన్ని థియేటర్స్ కు రప్పించడానికి నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు... బుధవారం బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియా ఎగ్జిబిటర్స్ మీట్ లో ఈ డెసిషన్స్ పై చర్చ సాగింది... అందరూ వీటిని అమలు చేయాలనే తీర్మానించారు... ఇంతకూ ఏమిటవి !?


'ఎయిట్ వీక్స్ సిస్టమ్'...
తెలుగు సినిమా సక్సెస్ రేట్ గణనీయంగా పడిపోయింది... గత సంవత్సరం పట్టుమని ఐదు శాతం సక్సెస్ రేట్ కూడా లేదు... దీంతో సినిమాకు ఆదరణ కరువైందన్న భావన అందరిలోనూ కలిగింది... మన సినిమాల విజయాల శాతం తక్కువగా ఉండడం వల్ల థియేటర్స్ కు వచ్చే జనం తగ్గిపోతున్నారు... దీనికి ఇప్పటి దాకా అమలులో ఉన్న '4 వారాల ఓటీటీ విధానం' కూడా కారణమని చెప్పొచ్చు... ఈ విధానం వల్ల సినిమా రిలీజై ఎంత బిగ్ హిట్ అయినా, థియేటర్స్ లో రన్నింగ్ లో ఉన్నా సరే నాలుగు వారాలకు ఓటీటీలో ప్రత్యక్షం కావలసిందే... నెలరోజులకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు వస్తూ ఉండడంతో థియేటర్స్ లో మూవీస్ చూడడటానికి జనం ఆసక్తి చూపించడం లేదు... దీంతో సినిమా హాళ్ళకు వసూళ్ళు బాగా తగ్గాయి... ముఖ్యంగా సింగిల్ థియేటర్స్ వారికి ఇది పెద్ద దెబ్బగా మారింది... దాంతో అనేక కేంద్రాలలో సింగిల్ థియేటర్స్ కేవలం బిగ్ హీరోస్ మూవీస్ రిలీజైన మూడు రోజులు ఆడటానికి తెరుస్తున్నారు... తరువాత జనాలు లేక మూసేసుకుంటున్నారు... ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టడానికే '8 వీక్స్ సిస్టమ్'ను అమలు చేయాలని సౌత్ ఇండియా ఎగ్జిబిటర్స్ నిర్ణయించారు... ఇప్పటికే ఈ విధానం ఉత్తరాదిన అమలవుతూ ఉంది... ఇకపై దక్షిణాది ఐదు రాష్ట్రాల్లోనూ '8 వారాల విధానం' అమలు కానుంది... దీని వల్ల సినిమా రిలీజైన 8 వారాల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది...

మళ్ళీ 'పర్సంటేజ్ సిస్టమ్'...
క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్స్ కు నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వంటి బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ మొత్తాలు ఇచ్చి సినిమాలను సొంతం చేసుకుంటున్నాయి... దాదాపు సగం సినిమా నిర్మాణ వ్యయం ఓటీటీ ద్వారానే లభిస్తూ ఉండడంతో క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తోన్న నిర్మాతలు సైతం ఓటీటీ డిమాండ్స్ కు తలొగ్గవలసి వచ్చింది... అలా సినిమా రిలీజైన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలన్న విధానం బయలు దేరింది... మెల్లగా అది ఊపందుకొని  మొత్తం దక్షిణాదిని కమ్మేసింది... దీంతో జనాలు థియేటర్లకు రాని పరిస్థితి. దీనిని ఎదుర్కోవాలంటే ముందు ఓటీటీకి '8 వారాల తరువాతే సినిమా' అనే విధానం రావలసిందే అని ప్రదర్శనదారులు భావించారు... బుధవారం బెంగళూరులో దక్షిణాదికి చెందిన 60 మంది థియేటర్ల ఓనర్స్ సమావేశమయ్యారు... తెలుగు సినిమా రంగం నుండి డి.సురేశ్ బాబు, దిల్ రాజు వంటి 15 మంది ఈ మీటింగ్ లో పాలు పంచుకున్నారు... ఇకపై తు.చ. తప్పకుండా '8 వీక్స్ సిస్టమ్' అమలు చేయాల్సిందే అని నిర్ణయించారు... అలాగే సింగిల్ థియేటర్స్ ను 'పర్సంటేజ్ సిస్టమ్'లో నడిచేలా చూడాలనీ భావించారు... ఈ రెండు నిర్ణయాలు అమలయితే సినిమా హాళ్ళ వద్ద మళ్ళీ పండగ వాతావరణం కనిపించక మానదు...

తగ్గించి తీరాల్సిందే...

నిజానికి సినిమా సక్సెస్ రేట్ పెరగాలంటే నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గాలి... అందుకోసం నిర్మాతలు బడ్జెట్ ను కంట్రోల్ చేయాలి... స్టార్స్, టెక్నీషియన్స్ కూడా అందుకు సహకరించాలి... భారీ మొత్తాలు డిమాండ్ చేసేవారితో కాకుండా తమ ఖర్చుకు తగ్గ వారినే నిర్మాతలు ఎంచుకోవాలి... ఈ మధ్య 'జై హనుమాన్' సినిమాటోగ్రాఫర్ భారీగా డిమాండ్ చేయడంతో అతణ్ణి తొలగించి, వేరొకరిని ఎంచుకున్నారు మేకర్స్... విజయ్ దేవరకొండ, రశ్మిక జంటగా రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'రణబాలి' షూటింగ్ కోసం ఫెడరేషన్ వారు భారీ స్థాయిలో రేట్లు పెంచమని డిమాండ్ చేస్తే... మేకర్స్  ఏకంగా షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేశారు... ఇప్పటికే రవితేజ వంటి కొందరు స్టార్స్ పర్సంటేజ్ పద్ధతిలో నటించడానికి అంగీకరిస్తున్నారు...  అలాగే ప్రస్తుతం మల్టీప్లెక్స్ లకు అమలులో ఉన్న పర్సంటేజ్ సిస్టమ్ ను సింగిల్ థియేటర్స్ కు కూడా అప్లై చేయాలని నిర్ణయించారు... ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఈ విధానం కొనసాగుతోంది... ప్రస్తుతం 60 శాతం పైగా షూటింగ్ జరుపుకున్న చిత్రాలకు ఈ '8 వీక్స్ సిస్టమ్' వర్తించదు... కానీ, కొత్తగా ఆరంభించే సినిమాల వారు ఈ విధానాన్ని దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ నిర్ణయించుకోవాలి... 'ఎనిమిది వారాల విధానం' అమలయితే ఓటీటీ సంస్థలు కూడా మునుపటి రేట్ ఇచ్చే అవకాశం ఉండదు... ఈ విషయాలన్నిటినీ గుర్తుంచుకొని మరీ నిర్మాతలు బడ్జెట్ ను కంట్రోల్ చేసుకోగలిగితే తప్పకుండా సినిమాకు మళ్ళీ మంచి రోజులు రై రై మంటూ  వస్తాయని చెప్పొచ్చు...  

 

Updated Date - Mar 12 , 2026 | 11:21 PM