సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

షాకింగ్.. కుర్చీతాత ఇక లేడు..

ABN, Publish Date - May 21 , 2026 | 05:13 PM

కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో స్టార్ గా మారాడు మహ్మద్ పాషా అనే వృద్ధుడు. ఇంగ్లీష్, తెలుగు కలిపి మాట్లాడుతూ.. స్వచ్ఛమైన నవ్వుతో అభిమానులను అలరించిన ఆ వృద్ధుడు ఇక లేడు. సోషల్ మీడియా మొత్తం కుర్చీ తాత అని పిలుచుకునే మహ్మద్ పాషా గుండెపోటుతో మరణించాడు.

Kurchi Thatha

కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో స్టార్ గా మారాడు మహ్మద్ పాషా అనే వృద్ధుడు. ఇంగ్లీష్, తెలుగు కలిపి మాట్లాడుతూ.. స్వచ్ఛమైన నవ్వుతో అభిమానులను అలరించిన ఆ వృద్ధుడు ఇక లేడు. సోషల్ మీడియా మొత్తం కుర్చీ తాత అని పిలుచుకునే మహ్మద్ పాషా గుండెపోటుతో మరణించాడు. గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో పోరాడుతున్న కుర్చీ తాత.. కృష్ణకాంత్ పార్క్ లో వేకింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


కుర్చీతాత మృతి వార్త తెలిసి సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. కుర్చీ తాత వీడియోలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, ఆయన నవ్వు మర్చిపోలేం అంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆయనను ఫేమస్ చేసింది గుంటూరు కారం సినిమాలోని సాంగ్. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో ఈ డైలాగ్ ని వాడి కుర్చీ మడతపెట్టి సాంగ్ చేశారు. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా కూడా మారింది.

Updated Date - May 21 , 2026 | 05:21 PM