Yamini ER: ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ హీరోయిన్ గా..
ABN, Publish Date - Jan 22 , 2026 | 02:35 PM
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ (Yamini ER)ను హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. గతంలో ఉత్తర, ఆర్టిస్ట్ చిత్రాలతో మంచి ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న రతన్ రిషి (Rathan RIshi) ఈ సినిమాకు దర్శకుడు. తన మూడో చిత్రంగా యామినీ ఈ ఆర్ తో హీరోయిన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు. కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90's హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న ఈ సిస్టమ్, సొసైటీలో జరిగే ప్రేమ కథతో మూవీ రూపొందుతున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. పోస్టర్లో బ్లడ్ థీమ్, అమ్మాయి, అబ్బాయి చేయి చేయి కలిపిన సన్నివేశం చూస్తుంటే ఇదొక బ్లడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఫిబ్రవరి 14న టైటిల్ ప్రకటించనున్నారు.