సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన మెగా కోడలు
ABN, Publish Date - Mar 10 , 2026 | 09:24 AM
సోషల్ మీడియాలో వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా వేధింపులపై మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi) హైదరాబాద్ సైబర్ క్రైమ్ (cyber crime police) పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'Purple Crayon' పేరు ఉన్న ఖాతా ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
ఆ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు చేస్తున్నారని లావణ్య పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ పరువు నష్టం కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తనపై అసభ్యకరంగా ఉన్న పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య త్రిపాఠి పోలీసులను కోరారు.
లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు బీఎన్ఎస్ 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిర్వాహకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.