రాజకీయాలపై అక్కినేని కోడలు సంచలన వ్యాఖ్యలు..
ABN, Publish Date - Aug 05 , 2026 | 04:33 PM
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు.. ఎందుకు ట్రోల్ కి గురవుతున్నారో తెలియడం లేదు. సాధారణంగా ఈ మధ్య కాలంలో నటులు స్టేజీపై మాట్లాడడానికి భయపడుతున్నారు.
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు.. ఎందుకు ట్రోల్ కి గురవుతున్నారో తెలియడం లేదు. సాధారణంగా ఈ మధ్య కాలంలో నటులు స్టేజీపై మాట్లాడడానికి భయపడుతున్నారు. ఏ మాట మాట్లాడితే ఏ వివాదం వస్తుందో .. ట్రోల్ కి గురవుతావేమో అని.. కానీ, కొందరు మాత్రం స్టేజీపై మాట్లాడకపోయినా ట్రోల్స్ బారిన పడుతున్నారు. అందుకు కారణం.. వారు ఎప్పుడో ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో తాము ఒక అభిప్రాయాన్ని పంచుకోవడం. అప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో ఇప్పుడు ఆ అభిప్రాయాలను తప్పుపడుతూ కొత్త చర్చలకు దారితీస్తున్నారు. తాజాగా అక్కినేని పెద్ద కోడలు శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) గతంలో రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు సడెన్ గా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ పాన్-ఇండియా స్థాయిలో మెప్పించిన ఆమె రెండేళ్ల క్రితం అక్కినేని నాగచైతన్యను వివాహమాడి అక్కినేని వారి ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు, సినిమాలతో శోభిత ఫుల్ బిజీగా గడుపుతుంది. తాజాగా సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల గతంలో రాజకీయాలపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వచ్చి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తనకు వామపక్ష భావజాలం అంటే ఎంతో ఇష్టమని, ఆ సిద్ధాంతాలపై తనకు బలమైన నమ్మకం ఉందని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సమాజంలో మార్పు రావాలంటే ఆ సిద్ధాంతాలే మార్గమని, భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
సాధారణంగా సినీ నటీనటులు రాజకీయ సిద్ధాంతాలపై మాట్లాడటానికి వెనుకాడతారు, కానీ శోభిత అంత బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలిగా మారిన తర్వాత ఆమె చేసిన ఈ పాత కామెంట్స్ మళ్లీ సోషల్ మీడియాలో రీ-సర్క్యులేట్ అవుతుండటంతో నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై శోభిత ఏమైనా స్పందిస్తుందా.. లేదా అనేది చూడాలి.