సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sobhita Dhulipala: పెళ్లయ్యాక చైతన్యకి 150 రోజులు దూరంగా ఉన్నా..

ABN, Publish Date - Aug 25 , 2026 | 09:43 PM

అక్కినేని పెద్ద కోడలు శోభితా ధూళిపాళ్ల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్యని ప్రేమించి, పెళ్ళాడిన శోభిత ప్రస్తుతం ఒకపక్క కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క నటిగా కూడా బిజీగా మారింది.

Sobhita Dhulipala

అక్కినేని పెద్ద కోడలు శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్యని ప్రేమించి, పెళ్ళాడిన శోభిత ప్రస్తుతం ఒకపక్క కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క నటిగా కూడా బిజీగా మారింది. ఒకప్పుడు శోభితను తిట్టినవారే.. ఆమె, చైపై చూపిస్తున్న ప్రేమను చూసి పర్ఫెక్ట్ జోడీ అంటూ ప్రశంసిస్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా శోభిత ఇంటర్వ్యూలు ఇస్తూ కెరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత, తన వైవాహిక జీవితం మరియు కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


మొదట్లో పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేయడం కష్టమని, ఇప్పుడిప్పుడే దాన్ని బ్యాలెన్స్ చేయడం అలవాటు చేసుకుంటున్నట్లు తెలిపింది. పెళ్లి తరువాత తామిద్దరం వర్క్ లో బిజీగా ఉన్నామని చెప్పుకొచ్చింది. 'పెళ్లయిన మొదటి ఏడాది మేమిద్దరం కెరీర్ పరంగా చాలా బిజీగా గడిపాం. వివాహమైన కొద్ది వారాలకే నేను షూటింగ్ కోసం తమిళనాడు వెళ్ళాను. అక్కడ దాదాపు 150 రోజులకు పైగా ఉన్నాను. ఆ సమయంలో నెలకొకసారి మాత్రమే చైతన్యను కలిసేదాన్ని. ఇద్దరి ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం మొదట్లో సవాల్‌గా అనిపించినప్పటికీ, ఇప్పుడు మా కొత్త జీవితానికి నెమ్మదిగా అలవాటు పడ్డాం. మా బంధాన్ని ఏది బలంగా ఉంచుతుందో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను' అంటూ తెలిపింది.


అలాగే తన పెళ్లి కలల గురించి చెప్తూ.. 'నా పెళ్లి పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలోనే జరగాలని చిన్నప్పటి నుంచి కోరుకునేదాన్ని. నా సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని భావించాను కానీ, ఒక నటుడికి భార్య అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అదృష్టవశాత్తూ నా కల నెరవేరింది. ఇక నా కెరీర్ విషయానికొస్తే.. మొదట్లో ఎక్కువ ఇండిపెండెంట్ చిత్రాలు చేయడం వలన మంచి గుర్తింపు వచ్చింది. సాధారణంగా కమర్షియల్ బ్రాండ్లు గుర్తింపు ఉన్న నటుల కోసమే చూస్తాయి. రెండేళ్ల తరువాత ఆ బ్రాండ్లే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి' అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Aug 25 , 2026 | 09:43 PM