అక్కినేని పెద్ద కోడలు గుడ్ న్యూస్ చెప్తుందా..
ABN, Publish Date - Jul 03 , 2026 | 04:42 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రెగ్నెంట్ అన్న విషయం తెల్సిందే. రాజ్ నిడిమోరుని వివాహమాడి ఏడాది కూడా కాకముందే సామ్ శుభవార్త చెప్పి ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురిచేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రెగ్నెంట్ అన్న విషయం తెల్సిందే. రాజ్ నిడిమోరుని వివాహమాడి ఏడాది కూడా కాకముందే సామ్ శుభవార్త చెప్పి ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఇక సామ్ ప్రెగ్నెంట్ కావడంతో అందరి చూపు అక్కినేని కోడలు శోభితా (Sobhita) మీదనే ఉంది. సామ్ కన్నా ముందే అక్కినేని నాగ చైతన్య- శోభితల వివాహం జరిగింది. కానీ, ఇప్పటివరకు శోభితా గుడ్ న్యూస్ చెప్పింది లేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చై- శోభిత పెళ్లి అయిన మూడు నెలలకే ఆమె తల్లి కాబోతుంది అంటూ వార్తలు షికార్లు చేశాయి. కానీ, వాటిలో నిజం లేదని ఆ తరువాత క్లారిటీ వచ్చింది.
ఏఎన్నార్ మరణం తరువాత.. మనవళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయి. చై, అఖిల్ భార్యల్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా.. ఏఎన్నార్ మళ్ళీ పుడతాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎక్కువగా చై - శోభితలకే ఏఎన్నార్ పుడితే బావుంటుందని కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు అక్కినేని వంశ వారసుడు గురించి శుభవార్త చెప్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నారు. కానీ, అది ఇప్పట్లో జరుగుతుందా అంటే.. ఎవరికి తెలియదు.
గత కొన్ని నెలలుగా శోభిత బయట కనిపించడం లేదు. దీంతో ఆమె కూడా ఏదైనా శుభవార్తను దాస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున తాత అయ్యే రోజు ఎప్పుడు వస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ద కోడలు అయినా.. చిన్న కోడలు అయినా.. ఆ గుడ్ న్యూస్ చెప్పే రోజు త్వరలో ఉంటే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శోభిత సినిమా సెలక్షన్స్ లో బిజీగా ఉందని టాక్. ఈ ఏడాది చీకటిలో అనే ఒరిజినల్ సినిమాతో వచ్చిన శోభిత త్వరలోనే మరో సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి అక్కినేని ఇంట వారసుడు వచ్చే తరుణం ఎప్పుడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!
72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?
National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!