Sky: వారం ఆలస్యంగా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్...
ABN, Publish Date - Feb 05 , 2026 | 03:09 PM
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి ప్రధాన పాత్రలు పోషించిన 'స్కై' మూవీ వారం ఆలస్యంగా విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 6న రావాల్సిన ఈ సినిమా 13న రిలీజ్ అవుతోంది.
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి ప్రధాన పాత్రల్లో నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా 'స్కై' (Sky). దీనికి పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ (Shiva Prasad) మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఫిబ్రవరి 6న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా ఒక వారం ఆలస్యంగా 13వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ మేకర్స్ ఓ లేఖను విడుదల చేశారు.
ఇద్దరు ప్రేమికుల మధ్య ఊహించిన విభేదాలు తలెత్తినప్పుడు వారు వాటిని ఎలా పరిష్కరించుకుని తిరిగి దగ్గరయ్యారనే కథాంశంతో 'స్కై' మూవీ రూపుదిద్దుకుని దీని ట్రైలర్ చూసినప్పుడు అర్థమౌతోంది. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధానికీ పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఈ ప్రేమకథా చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించగా, శివప్రసాద్ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు పృథ్వీ పెరిచెర్ల నే ఈ సినిమాకు సాహిత్యం అందించారు.