సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mangli: చీటింగ్ కేసు.. మంగ్లీకి ఊర‌ట‌

ABN, Publish Date - May 07 , 2026 | 07:12 PM

మైక్రోఫైనాన్స్ చీటింగ్ కేసులో సింగర్ మంగ్లీకి ఊరట ల‌భించింది.

Mangli

మైక్రోఫైనాన్స్ చీటింగ్ కేసులో సింగర్ మంగ్లీ (Mangli)కి ఊరట ల‌భించింది. తనపై ఉద్దేశపూర్వకంగా కావాల‌ని కొంద‌రు త‌ప్పుడు ప్రచారాలు చేస్తు త‌న ప‌రువుకు భంగం క‌లిగిస్తున్నారంటూ మంగ్లీ ఇటీవ‌ల‌ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. తన పరువుకి భంగం కలిగించేలా యూట్యూబ్‌, టీవీ ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాల‌లో త‌న పేరు. ఫొటోల‌తో ప్రసారం చేసిన వీడియోలను తొలగింపజేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు ప్రణాళికలతో కొంత‌మంది వ్యక్తులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని మంగ్లీ ఈ ఫిటీష‌న్‌లో పేర్కొంది.

వెంట‌నే సామాజిక మాధ్య‌మాల‌లో ఆయా లింకుల‌ను తొలగింప‌జేయాలని, ఆపై తనపై అసత్య ప్రచారం చేయకుండా నిరోధించాలని మంగ్లీ కోర్టును అభ్యర్థించింది. ఈ పిటిషన్‌ను విచారించన కోర్టు సింగ‌ర్‌ మంగ్లీపై ఎలాంటి ప్రచారాలు, పోస్టులు చేయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. అంతేగాక‌ పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు రమావత్ మధు, సుబ్బారావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

Updated Date - May 07 , 2026 | 07:12 PM