సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వ్యాపారం.. అధిక లాభాలు అంటూ మోసం చేసిన మంగ్లి..

ABN, Publish Date - Apr 11 , 2026 | 10:09 AM

వ్యాపారం.. అధిక లాభాలు అంటూ మోసం చేసిన మంగ్లి.. సింగర్‌ మంగ్లికి వివాదాలు కొత్తేమీ కాదు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారామె.


సింగర్‌ మంగ్లికి (Mangli) వివాదాలు కొత్తేమీ కాదు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారామె. తాజాగా పంజాగుట పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్‌ పేరిట రూ.10 కోట్ల మోసం చేశారని (Microfinance Fraud Case) మంగ్లి, ఆమె సోదరుడు శివ(Shiva), మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.  

పోలీసుల సమాచారం ప్రకారం..
మంగ్లి, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని, వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించి ఈ డబ్బు తీసుకున్నట్లు తెలిపారు. అయితే కాలం గడుస్తున్నప్పటికీ లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు. తనకు ఫోన్‌ చేసి మంగ్లి, ఆమె సోదరుడు శివ బెదిరింపులకు పాల్పడ్డారని, తనను యాక్సిడెంట్‌ చేసి చంపుతామని బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.

ఫోక్‌ సాంగ్స్‌తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంగ్లి.. తర్వాత సినిమా పాటలతోనూ పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మాత్రమే కాకుండ తమిళ, కన్నడ హిందీ భాషల్లో ఆమె పాటలు పాడుతున్నారు. ఇటీవల కన్నడ చిత్రం ‘కేడీ: ద డెవిల్‌’ చిత్రంలోని ‘సర్కే చునార్‌’ హిందీ వెర్షన్‌ సాంగ్‌ను మంగ్లి పాడారు. ఆ పాటలో లిరిక్స్‌ అభ్యంతరకరంగా ఉన్నాయని కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆ పాటను యూట్యూబ్‌ నుంచి తొలగించారు.

Updated Date - Apr 11 , 2026 | 10:27 AM