చెన్నయ్ లో ముగిసిన సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 07:14 PM
సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు చెన్నయ్‌లో ఆదివారం సాయంత్రం జరిగాయి.
సుప్రసిద్థ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు (95) శనివారం రాత్రి అనారోగ్యంతో చెన్నయ్‌లోని కావేరీ హాస్పిటల్ లో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి సింగీతం శ్రీనివాసరావు మరణవార్త తెలియగానే తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమలకు చెందిన పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం చెన్నయ్‌లోని నేసపాక్కం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు జరిపారు. సింగీతం శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శకుంతల, చిన్న కుమార్తె సుధ ఉన్నారు. ఆయన అన్న కుమారుడు పూర్ణ ప్రజ్ఞ దగ్గరుండి అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించారు. సింగీతం శ్రీనివాసరావు దగ్గర పూర్ణ దశాబ్దాలుగా కో-డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు ఆయన కేర్ టేకర్ గా ఉన్నారు.
ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్‌తో పాటు సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలలో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్, నాగ అశ్విన్, స్వప్న దత్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి. ఎన్. ఆదిత్య, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొని ఆయన పార్దీవ దేహానికి అంజలి ఘటించారు. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
మరో విభిన్నమైన కథతో సిద్ధమైన ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు
Peddi Movie: దసరా బరిలో ‘పెద్ది’ కూడా..
ఆ సినిమా నాకిచ్చిన దైవవరం.. సినీ శ్వాస సింగీతం: ‘ఆదిత్య 369’ నిర్మాత