Siddu 10: సిద్దు.. నయన్.. ఓ రొమాంటిక్ డ్రామా
ABN, Publish Date - Nov 11 , 2026 | 12:43 PM
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నూతన చిత్రం బుధవారం హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నూతన చిత్రం బుధవారం హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఆయన హీరోగా నటిస్తున్న పదవ సినిమా ఇది. ‘సిద్ధు 10’ (Siddhu 10) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్ సారిక కథానాయిక. మోహన్ బి దర్శకత్వం వహించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి, గ్లింప్స్ లాంచ్ చేయగా, బుచ్చి బాబు సానా స్క్రిప్ట్ అందజేశారు.
రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. తబితా సుకుమార్ సమర్పిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. హరీష్ శంకర్, నందినిరెడ్డి చందు మొండేటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ALSO READ: