సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమాటోగ్రాఫర్ షామ్‌ దత్‌ తెలుగు సినిమా!

ABN, Publish Date - Apr 06 , 2026 | 02:09 PM

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షామ్‌ దత్‌ తెలుగులో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో మమ్ముట్టీతో ఈయన 'స్ట్రీట్‌ లైట్స్' మూవీని డైరెక్ట్ చేశారు. షామ్‌ దత్‌ తాజా చిత్రానికి 'డోంట్‌ స్లీప్‌' అనే టైటిల్ ఖరారు చేశారు.

Don't Sleep Movie

సినిమాటోగ్రాఫర్స్ దర్శకులుగా మారడం భారతీయ సినిమా రంగంలో కొత్తేమీ కాదు. కేరళకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్‌ ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు చేశారు. అంతేకాదు. మమ్ముట్టి కథానాయకుడిగా 2018లోనే 'స్ట్రీట్‌ లైట్స్' పేరుతో ఓ మలయాళ సినిమాను డైరెక్ట్ చేశారు. విశేషం ఏమంటే... ఇప్పటికే పలు విజయవంతమైన తెలుగు సినిమాలకు వర్క్ చేసిన షామ్‌దత్‌ ఇప్పుడు తెలుగులో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 5 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా పేరును రివీల్‌ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.


'డోంట్‌ స్లీప్‌' అనే పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ పోస్టర్ ను విజయ్‌ సేతుపతి సోషల్ మీడియా వేదికగా రిలీజ్‌ చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. గత యేడాది వచ్చిన 'చౌర్యపాఠం'లో కీలక పాత్ర పోషించిన ఇంద్రరామ్‌ 'డోంట్‌ స్లీప్‌'లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సజీర్‌ బాబా, లూనా జబీన్‌ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. దర్శకుడిగానే కాకుండా షామ్ దత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రవీంద్ర విజయ్‌, తాబా రీమా, జ్యోతీ బెనర్జీ, సునీల్‌ తపా, 'ఆడుకాలం' నరేన్‌, కల్పలత, అనీష్‌ కురువిల్లా, 'వెన్నెల' కిశోర్‌, డాక్టర్ భద్రమ్, రఘుబాబు తదితరులు పోషిస్తున్నారు. విశేషం ఏమంటే... ప్రముఖ దర్శకుడు దేవా కట్ట కూడా ఇందులో నటిస్తున్నారు. కె.కె. సాహిత్యం అందిస్తుండగా, గోకుల్ హర్షన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. వి డ్రీమ్‌ ఫిలిమ్స్ బ్యానర్‌పై 'డోంట్‌ స్లీప్‌' మూవీని వి. చూడామణి నిర్మిస్తున్నారు. సజనా షామ్‌దత్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Apr 06 , 2026 | 02:09 PM