సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ది స్పెష‌ల్ సాంగ్‌.. బుచ్చిబాబు ప్లాన్ అదిరింది!

ABN, Publish Date - Apr 22 , 2026 | 11:31 AM

పెద్ది స్పెష‌ల్ సాంగ్‌ కోసం దేశ వ్యాప్తంగా స‌గం మంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, మేకర్స్ చివరకు శ్రుతి హాసన్ ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Chiranjeevi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది'. అయితే ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసే బ్యూటీ ఎవరా అని. ఈ సాంగ్ కోసం మొదట మృణాల్ ఠాకూర్, మానస వారణాసి ఇంకా సంయుక్త మీనన్ ఇలా దేశ వ్యాప్తంగా స‌గం మంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, మేకర్స్ చివరకు శ్రుతి హాసన్ (Shruti Haasan) ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

అయితే.. శ్రుతి హాసన్ రామ్ చరణ్‌తో జతకట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరిద్దరూ కలిసి 'ఎవడు' సినిమాలో నటించి మెప్పించారు. ఆ చిత్రంలో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ స్పెషల్ సాంగ్ ద్వారా వీరిద్దరి కాంబో వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది. రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు అన్న సంగతి చాలామందికి ఎరుకైన విషయమే. వీరిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కేవలం తన సినిమాల్లోనే కాకుండా, గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'ఆగడు', నాని 'హాయ్ నాన్న' చిత్రాల్లో కూడా శ్రుతి హాసన్ ప్రత్యేక గీతాల‌లో మెరిసిన సంగతి ఇక్కడ గమనించదగ్గ విషయం.

ఇక 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆమె తెలుగులో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. రెహమాన్ స్వరపరిచే ట్యూన్స్, ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇంతమంది అగ్ర నటులు కలవడంతో 'పెద్ది' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరో ఆరు రోజులు మాత్రమే ఉన్న ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణను కూడా ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే స్పెషల్ సాంగ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ షార్ట్, పహిల్వాన్ గ్లింప్స్, చికిరి తో పాటు రేయ్ రేయ్ రా సాంగ్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిన సత్యమే. ఈ అప్‌డేట్స్ అన్నీ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని అమాంతం పెంచేశాయి. రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ తోడవడంతో, ఈ స్పెషల్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్ చరణ్ మాస్ డ్యాన్స్ స్టెప్పులు, శ్రుతి హాసన్ గ్లామర్ ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 02:39 PM