సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రేయా పాటకు సీఎం సైతం ఫిదా.. మాయ చేసేసింది..

ABN, Publish Date - Mar 20 , 2026 | 05:00 PM

శ్రేయా మ్యూజికల్‌ స్టేజ్‌ షో చేసిందీ అంటే సంగీత ప్రియులు మైమరచిపోతారు. ఈతరం ఫీమేల్‌ సింగర్స్‌లో మొదటి వరుసలో ఆమె ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు.

శ్రేయా ఘోషల్‌.. (Shreya Ghoshal) పరిచయం అక్కర్లేని గాయని. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన శ్రేయా 18 భాషల్లో 3000లకు పైగా పాటలు పాడారు. ముఖ్యంగా ఆమె తెలుగులో 280కి పైగా పాటలు పాడితే అందులో 70 శాతం హిట్‌ పాటలే! శ్రేయా మ్యూజికల్‌ స్టేజ్‌ షో చేసిందీ అంటే సంగీత ప్రియులు మైమరచిపోతారు. ఈ తరం ఫీమేల్‌ సింగర్స్‌లో మొదటి వరుసలో ఆమె ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. మోస్ట్‌ బిజీయెస్ట్‌ సింగర్‌ కూడా! క్లాస్‌, మాస్‌, మెలోడీ పాట జానర్‌ ఏదైనా సరే ఆమె గానానికి ప్రేక్షకుల ఫిదా అయిపోవలసిందే!

ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన గద్దర్‌ అవార్డు (Gaddar Film Award) వేడుకల్లో ఆమె మెరిశారు. వేదికను ఆ ముందున్న ఆహుతులను కాసేపు షేక్‌ చేసేశారు శ్రేయా. గద్దర్‌ అవార్డ్స్‌ స్టేజ్‌పై సింగర్‌ శ్రేయ ఘోషల్‌ తన పాటలతో మాయ చేశారు. ‘ఒక్కడు’ సినిమాలో ‘నువ్వేం మాయ చేశావో కానీ’ పాట అందుకోగానే వేదిక ముందున్న ఆ చిత్ర కథానాయిక భూమిక స్వరం కలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి చేయి కదుపుతూ పాటను ఎంతో ముచ్చటగా విన్నారు. కథానాయికలు రష్మిక, జెనీలియా అయితే చప్పట్లు మోగిస్తూనే ఉన్నారు. అంతగా తన గానం ప్రేక్షకుల్ని మైమరపోయేలా చేసింది.

సాధారణంగా వేదికపై నాలుగైదు పాటలు పాడి వెళ్లిపోయే షోలకు శ్రేయాఘోషల్‌ చాలాకాలంగా దూరంగా ఉంటున్నారు. ఆమె వ్యక్తిగత కాన్సెర్ట్‌లు, ఇతర లైవ్‌ షోలకు మాత్రమే ఆమె హాజరవు తుంటారు. కానీ కేవలం ఓ ఆరు పాటలు పాడటానికి ఆమె గద్దర్‌ అవార్డు ఫంక్షన్‌ను వచ్చారంటే విశేషమనే చెప్పాలి. శ్రేయా సంగీత విభావరి ఈ ఈవెంట్‌కు ఓ హైల ఏదేమైనా శ్రేయాఘోషల్‌ పాడిన పాటలు, ఆమె పెర్‌ఫార్మెన్స్‌ ఈ ఈవెంట్‌కు హైలైట్‌ అనే చెప్పాలి.

Updated Date - Mar 20 , 2026 | 05:26 PM