సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Siva Kandukuri: మరింత ఆలస్యంగా 'చాయ్ వాలా'

ABN, Publish Date - Feb 04 , 2026 | 06:31 PM

శివ కందుకూరి హీరోగా నటించిన 'చాయ్ వాలా' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.

Chaiwala Movie

ప్రామిసింగ్ హీరో శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సెన్సిబుల్ ల‌వ్‌స్టోరీ 'చాయ్ వాలా'. ఫిబ్రవరి 6న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హర్షిక ప్రొడక్షన్స్ తెలిపింది. అనుకోని కారణాల వల్ల తమ చిత్రాన్ని ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ప్రమోద్ హర్ష రచన చేసి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాధా విజయలక్ష్మీ, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో 'చాయ్ వాలా' సినిమా రూపుదిద్దుకుంది. తేజు అశ్విని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రాజీవ్ కనకాల, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ఇందులో ముఖ్య పాత్రల్ని పోషించారు.

Updated Date - Feb 04 , 2026 | 06:32 PM