మహేష్ మమ్మల్ని మోసం చేశాడు.. సీక్రెట్ రివీల్ చేసిన మరదలు
ABN, Publish Date - Jul 07 , 2026 | 07:09 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెల్సిందే. అసలు ఆయన పంచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెల్సిందే. అసలు ఆయన పంచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన మరదలు నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) .. నమ్రతతో మహేష్ పెళ్ళైన కొత్తలో అక్కాచెల్లెళ్లను ఎలా మోసం చేశాడో చెప్పి షాక్ ఇచ్చింది. వారిద్దరి వద్ద ఒక విషయాన్ని దాచి ఏడిపించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
తాజాగా ఇండియాస్ బెస్ట్ డాన్సర్ షోలో పాల్గొన్న శిల్పా.. మహేష్ బాబుకి తమ మాతృభాష అయిన మరాఠీ వచ్చనే నిజాన్ని చాలా ఏళ్ల పాటు దాచి, తమ పర్సనల్ సీక్రెట్స్ అన్నింటినీ వినేవాడని, అది తెలియక తాము అన్నీ విషయాలు ఆయన ముందే మాట్లాడుకునేవాళ్ళం అని చెప్పింది. "మహేష్ కి, నమ్రతకి కొత్తగా పెళ్లయిన రోజుల్లో ఆయనకు మరాఠీ రాదనుకున్నాం. అందువల్ల మహేష్ ముందు మేము ఏదైనా రహస్యంగా మాట్లాడుకోవాలన్నా, పర్సనల్ విషయాలు డిస్కస్ చేయాలన్నా.. ఆయనకు అర్థం కాకూడదని మరాఠీలోనే మాట్లాడుకునేవాళ్లం. అయితే, పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు మేము ఇద్దరం మహేష్ ముందే ఏదో పర్సనల్ విషయం మాట్లాడుకుంటుండగా.. మహేష్ ఒక్కసారిగా స్పందిస్తూ మరాఠీలో అవునా.. నిజమా అని అన్నాడు. అది వినిమేము ఒక్కసారిగా షాక్ తిన్నాం.
ఆ తర్వాత మహేష్ బాబు నవ్వుతూ.. మరాఠీ నాకు అర్దమవుతుంది అని చెప్పడంతో తాము ఘోరంగా దొరికిపోయాం. అంటే ఇన్నేళ్లుగా తమకు తెలియకుండా మహేష్ తమ మరాఠీ సీక్రెట్స్ అన్నింటినీ సైలెంట్‌గా వింటూ ఎంజాయ్ చేశాడు. మహేష్ కి మరాఠీ వచ్చనే నిజం మాకు అప్పటివరకు తెలియదు.. ఆయన ఆ నిజాన్ని మా దగ్గర దాచాడు. అయితే, మంచి నవ్వులాటగా ముగిసిన ఈ ఇన్సిడెంట్ లో.. దేవుడి దయ వల్ల ఆయన గురించి తప్పుగా ఏమీ మాట్లాడుకోలేదు, లేదంటే మమ్మల్ని ఇంకా దారుణంగా ఆటపట్టించేవాడు' అంటూ శిల్ప నవ్వుతూ చెప్పుకొచ్చింది.