సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naari Naari Naduma Murari: శర్వా హ్యాట్రిక్.. రేర్ సంక్రాంతి రికార్డ్

ABN, Publish Date - Jan 15 , 2026 | 02:44 PM

సంక్రాంతి సీజన్ కలిసొచ్చిన హీరోలు చాలామందే ఉంటారు. కానీ జనవరి 14వ తేదీన విడుదలైన మూడు చిత్రాలతోనూ హ్యాట్రిక్ కొట్టిన హీరో బహుశా శర్వానంద్ ఒక్కరేనేమో. అదే తేదీన విడుదలైన అతని మూడు సినిమాలు వరుస విజయాలను అందుకున్నాయి.

Sharwanand Sankranti Hat-Trick Success

సంక్రాంతి సీజన్ కలిసొచ్చిన హీరోలు ఉంటారు. కానీ సంక్రాంతి సీజన్ లో ఒకే తేదీన విడుదలైన మూడు సినిమాలు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన హీరో బహుశా తెలుగులో శర్వానంద్ ఒక్కడేనేమో!

సంక్రాంతి (Sankranthi) సీజన్ అంటే పండగకు నాలుగైదు రోజుల ముందు విడుదలైన సినిమాలను సైతం కౌంట్ చేస్తారు. అలానే కనుమ రోజు విడుదలైన సినిమాలనూ అదే సీజన్ కింద లెక్క బెడతారు. ఆ రకంగా తెలుగులో అగ్ర కథానాయకులు చాలామంది సంక్రాంతి సీజన్ లో ఘన విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ వారికి శర్వానంద్ పూర్తి భిన్నం. ఇప్పటి వరకూ శర్వానంద్ (Sharwanand) నటించిన సినిమాలు సంక్రాంతి సీజన్ లో మూడు వచ్చాయి. విశేషం ఏమంటే ఆ మూడూ కూడా జనవరి 14నే విడుదలయ్యాయి. అందులో మొదటిది 'ఎక్స్ ప్రెస్ రాజా' (Express Raja). ఈ సినిమా 2016లో విడుదలైంది. అదే సంవత్సరం ఆ సీజన్ లో బాలకృష్ణ (Balakrishna) 'డిక్టేటర్', నాగార్జున (Nagarjuna) 'సోగ్గాడే చిన్ని నాయనా', జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) 'నాన్నకు ప్రేమతో' విడుదల అయ్యాయి. వాటితో పాటే వచ్చిన శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా' గట్టి పోటీని తట్టుకుని, నిలబడి విజయపథంలో సాగింది.


ఆ తర్వాత సంవత్సరం 2017లో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' భవతి' (Shatamanam Bhavati) మూవీ విడుదలైంది. ఈ సినిమాతో పాటే అప్పటి సంక్రాంతి సీజన్ లో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' వచ్చాయి. ఆ సినిమాలతో పాటే శర్వానంద్ 'శతమానం భవతి' మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు... జాతీయ స్థాయిలోనూ ఆ సినిమా అవార్డును పొందింది.

ఈ సంక్రాంతి సీజన్ లో ఏకంగా ఐదు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటగా 'ది రాజా సాబ్' వచ్చింది. ఆ వెనుకే చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ అయ్యింది. ఇక 13వ తేదీ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రాగా, 14వ తేదీ నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' విడుదలైంది. నిజానికి ఈ నెల 15న శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' విడుదల కావాల్సింది. కానీ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. 14వ తేదీ ఉదయం ఆటతో కాకుండా ఫస్ట్ షో తో ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ఆ రకంగా 'నారీ నారీ నడుమ మురారి' రిలీజ్ డేట్ ప్రీ పోన్ అయినట్టయ్యింది. అదే ఇప్పుడు శర్వాకు కొత్త సెంటిమెంట్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాను చూసిన వారంతా ఏకగ్రీవంగా అద్భుతంగా ఉందంటూ తెగ మెచ్చుకుంటున్నారు. నాన్ స్టాప్ కామెడీతో ఎక్కడా బోర్ అనేది కొట్టనీయకుండా దర్శకుడు, 'సామజవర గమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దీన్ని తెరకెక్కించాడని ప్రశంసిస్తున్నారు. హీరోయిన్లుగా నటించిన సాక్షి వైద్య, సంయుక్త సైతం చాలా బాగా చేశారని అభినందిస్తున్నారు. ఇక సీనియర్ నటుడు నరేశ్‌ అయితే ఈ సినిమా విజయం ప్రధాన భూమిక పోషించాడని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎంతో కాలంగా విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న నిర్మాత అనిల్ సుంకర కూ ' నారీ నారీ నడుమ మురారి'తో మంచి విజయం లభించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో... ఇక మీదట సంక్రాంతి సీజన్ లో జనవరి 14వ తేదీని శర్వానంద్ పేరుతో రాసేసుకోవచ్చు. అతని సినిమాలను హాయిగా ఆ రోజున ధైర్యంగా విడుదల చేసుకోవచ్చు.

Updated Date - Jan 15 , 2026 | 05:00 PM