సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ‌ర్వా గ‌ట్టిగానే ప్లాన్‌ చేశాడుగా! 'భోగి' ఫ‌స్ట్ లుక్ అదిరింది

ABN, Publish Date - Feb 25 , 2026 | 11:57 AM

'నారీ నారీ న‌డుమ మురారి' సినిమాతో వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న శ‌ర్వానంద్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

Sharwanand

ఈ ఏడాది సంక్రాంతికి సైలెంట్‌గా 'నారీ నారీ న‌డుమ మురారి' (Naari Naari Naduma Murari) సినిమాతో వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న శ‌ర్వానంద్ (Sharwanand) ఫుల్ జోష్‌లో ఉన్నాడు. త్వ‌ర‌లోనే 'బైక‌ర్' సినిమాతో అల‌రించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ మంచి హైప్ తీసుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో శ‌ర్వా న‌టిస్తున్న మ‌రో చిత్రం 'భోగి' (Bhogi) నుంచి కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా నుంచి శ‌ర్వా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌గా, విడుద‌ల తేదీని కూడా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాను ఆగ‌స్టు 28న థియేట‌ర్ల‌కు తీసుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు.

సంప‌త్ నంది (Sampath Nandi) ద‌ర్శ‌క‌త్వంలో... 1960 నాటి క‌థా నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ‌ర్వా నెవ‌ర్ బిఫోర్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా హైదరాబాద్‌లో భారీ యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్, డింపుల్ హ‌య‌తి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా టీమ్‌ రివీల్‌ చేసిన ఫ‌స్ట్ లుక్‌లో శ‌ర్వా మాస్, ర‌గ్గడ్‌ లుక్‌తో స్ట‌న్నింగ్ ఉన్నాడు. ఈ పోస్ట‌ర్ చూసిన వారంతా శ‌ర్వా ఏంటీ ఇంత షాకిచ్చాడు? ల‌వ‌ర్ బాయ్‌లా ఉండే వాడు ఇంత ర‌ఫ్‌గా మారిపోయూడేంటి? అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:38 PM