సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ba Ba Black Sheep:  శ‌ర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ 

ABN, Publish Date - Jan 24 , 2026 | 10:00 PM

ఒక రోజు జ‌రిగిన అనుకోని ఓ ఘ‌ట‌న‌తో 6 వ్య‌క్తుల జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’.

ఒక రోజు జ‌రిగిన అనుకోని ఓ ఘ‌ట‌న‌తో 6 వ్య‌క్తుల జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ (Ba Ba Black sheep) టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు.  దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న  ఈ సినిమా  టీజ‌ర్‌ను  హీరో శ‌ర్వానంద్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను  శుభాకాంక్షలు తెలిపారు. ‘చెప్పుకోడానికి ఇది మామూలు క‌థ కాదు. అండ పిండ బ్ర‌హ్మాండాల‌ను కూడా అల్లాడించే క‌థ’ అనే డైలాగ్ తో ఆసక్తికరంగా టీజర్ మొదలైంది. చుట్టూ ప‌చ్చ‌ద‌నం, కొండ‌లున్న అంద‌మైన ఊరిని చూపిస్ట్యూ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గ‌న్ ఫైరింగ్‌, కార్ చేజింగ్ వంటి ఎంగేజింగ్ సీన్స్  చూపించారు. టీజ‌ర్ చూస్తుంటే...డిఫ‌రెంట్ కామెడీ సినిమా అని,  ఓ బాక్స్‌, గ‌న్ చుట్టూ సినిమా తిరిగుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది.  


ఈ సంద‌ర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘
గ‌న్ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతుంటాడు. చివ‌ర‌కు ఆ బాక్స్ ఎవ‌రి ద‌గ్గ‌ర ఉంటుంది.. ఆ బాక్స్‌లో ఏముంటుంద‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే. సినిమా మొత్తాన్ని మేఘాల‌యా రాష్ట్రంలో లోనే పూర్తి చేశాం. చిరపుంజి వంటి అద్భుత‌మైన లొకేష‌న్స్‌లోనూ చిత్రీక‌రించాం. మేఘాల‌యాలో మొత్తం సినిమా షూటింగ్ జ‌రుపుకున్న తొలి సినిమా ‘బా బా బ్లాక్ షీప్‌’. అతి త‌క్కువ రోజుల్లోనే ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం.  ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌రలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అన్నారు.

 

Updated Date - Jan 24 , 2026 | 10:00 PM