Sharwanand: నా ఇమేజ్‌ను పక్కనపెట్టి కథను నమ్మాను.. ‘భోగి’తో నాలో కొత్త యాంగిల్ చూస్తారు
ABN, Publish Date - Nov 23 , 2026 | 07:14 AM
భోగి సినిమాతో తనలోని కొత్త యాంగిల్‌ను సంపత్ నంది చూపించారని శర్వానంద్ అన్నారు.
‘నా ఇమేజ్‌ను పక్కబెట్టి కథను నమ్మి చేసిన సినిమా ‘భోగి’ (Bhogi). దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఈ భాష కరెక్ట్‌గా వస్తుందా?నేను చెప్పగలనా అని అనిపించింది. ఎందుకంటే ప్రతి భాష ఒక తల్లిలాంటిది. మనం అమ్మతో మాట్లాడినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడతామో, భాష విషయలో కూడా ఆ గౌరవం మనకు ఉండాలి. సంపత్ నందికి మాస్ మీటర్ బాగా తెలుసు.
‘భోగి’ సినిమాతో సంపత్ నంది నాలో కొత్త యాంగిల్‌ను ఇండస్ట్రీకి చూపించారు. ఈ సినిమాలో నా పాత్రతో మీ అందరినీ మెప్పించగలనని అనుకుంటున్నాను. ఫస్ట్ కాపీ చూశాక చాలా సంతృప్తి కలిగింది’ అని అన్నారు శర్వానంద్ (Sharwanand) . ఆయన కథానాయకుడిగా సంపత్ నంది (Sampath Nandi) తెరకెక్కించిన చిత్రం ‘భోగి’. కేకే రాధామోషన్ నిర్మించారు. సినిమా ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో శర్వానంద్‌కు జాతీయ అవార్డు రావాలి. అంత అద్భుతంగా ఆయన నటించారు’ అని చెప్పారు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ ‘మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే ఈ చిత్రాన్ని విజయంవంతం చేయాలి’ అని కోరారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ డింపుల్ హయతి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో తదితరులు పాల్గొన్నారు.