ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన షణ్ముఖ్ జస్వంత్.. వధువు ఎవరంటే?
ABN, Publish Date - Jun 22 , 2026 | 04:17 PM
అరేయ్.. ఏంట్రా ఇది అనే డైలాగ్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth). నెమ్మదిగా కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ స్టార్ గా మారాడు.
అరేయ్.. ఏంట్రా ఇది అనే డైలాగ్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth). నెమ్మదిగా కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ స్టార్ గా మారాడు. ఇక మరో యూట్యూబర్ దీప్తి సూనైనాతో షణ్ముఖ్ నడిపిన ప్రేమాయణం.. వారిద్దరి రీల్స్ సోషల్ మీడియా ఏ రేంజ్ లో షేక్ చేసాయో అందరికీ తెల్సిందే. ఆ తరువాత వీరిద్దరూ ఒకరి తరువాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లేముందు దీప్తితో కొత్త జీవితం మొదలుపెడతానని చెప్పిన షణ్ముఖ్.. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు.
షణ్ముఖ్- దీప్తి విడిపోవడం వెనుక బిగ్ బాస్ లో అతడు.. సిరి హన్మంత్ తో క్లోజ్ గా ఉండడమే కారణమని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజమెంత అనేది ఇప్పటివరకు తెలియలేదు. ఇక దీప్తితో విడిపోయాక షణ్ముఖ్ తన కెరీర్ ని బిల్డ్ చేసుకొనే పనిలో పడ్డాడు. ప్రస్తుతం వరుస సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న షణ్ముఖ్ ఎట్టకేలకు కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. దీప్తి చాప్టర్ క్లోజ్ చేసి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు.
తాజాగా షణ్ముఖ్ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. జూన్ 21, ఆదివారం వైష్ణవి చోలిశెట్టి మెడలో షణ్ముఖ్ మూడు ముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పెళ్లి పూర్తిగా పెద్దలు కుదిర్చినదే అని తెలుస్తోంది. వైష్ణవి.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోన్నట్లు సమాచారం. ఇక షణ్ముఖ్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి పెళ్లి తరువాత షణ్ముఖ్.. లక్ కలిసి వచ్చి సినిమాల్లోకి అడుగుపెడతాదేమో చూడాలి.