Shanmukh Jaswanth: న్యూ ఇయర్.. సడన్ షాకిచ్చిన షణ్ముక్ జస్వంత్! మరోసారి.. ప్రేమలో
ABN, Publish Date - Jan 02 , 2026 | 10:00 AM
షణ్ముక్ జస్వంత్ ఈ పేరు తెలియని సోషల్‌మీడియా ఫాలోవర్ ఉండరు. తాజాగా ఆయన తను ప్రేమలో ఉన్నట్లు వెళ్లడించాడు.
షణ్ముక్ జస్వంత్ (Shanmukh Jaswanth) ఈ పేరు తెలియని సోషల్‌మీడియా ఫాలోవర్ ఉండరు. గడిచిన దశాబ్దంగా యూట్యూబ్ కంటెంట్ ద్వారా ప్రతి ఇంటికి చేరువయ్యాడు. వైవా న్యూస్ అంటూ, ట్రెండింగ్ పాటలకు కవర్ సాంగ్స్, ఆపై ప్రైవేట్ సాంగ్స్ లో నటిస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాక అదే సమయంలో మరో ఇన్‌ఫ్లూయన్సర్ దీప్తి సునయనతో చనువు, ప్రేమ కొంతకాలం వీరిని ట్రెండింగ్‌లో ఉంచాయి.
ఆ తర్వాత షణ్ముఖ్ బిగ్‌బాస్ ఎంట్రీ, సిరి హన్మంతుతో క్లోజ్‌గా మూవ్ కావడం కాస్త వారి మధ్య తేడాలు వచ్చి బ్రేకప్ కూడా జరిగిపోయాయి. అయితే.. ఆపై ఎవరి పనిలో వారు బిజీ కావడం వీరి గురించి అంతా మరిచిపోయారు. కొద్ది రోజుల తర్వాత షణ్ముక్ వెబ్ సిరీస్‌లు, ఒకట్రెండు సినిమాలు చేస్తూ కెరీర్‌పై ఫోకస్ పెట్టి బిజీగా మారాడు. మధ్యలో ఓ మారు డిఫ్రెషన్‌లోకి వెళ్లడం, గంజాయి కేసులో ఇరుక్కోవడంతో కొన్ని రోజులు వార్తల్లో ప్రధానంగా నిలిచాడు.
ఆపై తేరుకున్న షణ్ముఖ్ తిరిగి వెనకకు చూడకుండా వరుస సిరీస్‌లు, సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఈక్రమంలో ఇప్పటికే లీలా వినోదం సిరీస్‌తో అరించిన ఆయన త్వరలో ప్రేమకు నమస్కారం అనే చిత్రంలో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే.. ఈ సందర్భంలో తన ఫాలోవర్స్‌కు, ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ తను ప్రేమలో ఉన్నట్టు, తనకు భాగస్వామి లభించిందని,హ్యాపీ బర్త్‌గే వీ అంటూ తన ప్రేయసికికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అంతా గాడ్ గిఫ్ట్ అంటూ సర్‌ఫ్రైజ్ చేశాడు. ఇప్పుడు ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ఇది తెలసిఇన వారంతా షణ్ణు ఇంత షాకిచ్చావేంటి అంటూ కామెంట్లు పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలాఉంటే.. తను లవ్‌లో ఉన్నట్లు చెప్పిన షణ్ముఖ్ అ అమ్మయి ఎవరా అనేది మాత్రం రివీల్ చేయలేదు. తన పేరు మాత్రం వీ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందనేది మాత్రం స్పష్టం అయింది. దీంతో అనేక మంది ఆమె ఎవరై ఉంటారరి అని అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో జల్లెడ పడుతున్నారు.