Shambhala: ఓటీటీలో అదరగొడుతున్న శంబాల..
ABN, Publish Date - Feb 02 , 2026 | 05:10 PM
యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) హీరోగా యుగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శంబాల (Shambhala).
Shambhala: యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi SaiKumar) హీరోగా యుగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శంబాల (Shambhala). షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ (Archana Iyer) హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 24 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నో ఏళ్ళుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ కి బ్లాక్ బస్టర్ ని అందించింది. ఆది కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శంబాల కేవలం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది.
శంబాల జనవరి 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ఓటీటీలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో శంబాల కూడా ఒకటి. పదిరోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి కొత్త రికార్డ్ ను సృష్టించింది. దీంతో మేకర్స్ తన సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.
మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శంబాల కథ విషయానికొస్తే.. శంబాల అనే ఊరులో ఒక రాత్రి ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అది పడిన దగ్గర నుంచి ఆ ఊరిలో చాలామంది మరణిస్తారు. దీంతో ఆ రాయిని వారందరూ బండ భూతం అని పిలుస్తారు. ఆ రాయి ఏంటి అని కనుక్కోవడానికి ప్రభుత్వం సిటీ నుంచి శాస్త్రవేత్త విక్రమ్ (ఆది సాయి కుమార్) ని పంపిస్తుంది. దేవుడు లేడు ఈ భూమి అంతా సైన్స్ ప్రకారం నడుస్తుంది అని నమ్మే విక్రమ్.. ఆ బండ భూతం రహస్యాన్ని ఛేదించాడా.. ? ఈ ప్రాసెస్ లో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి.. ? విక్రమ్ కు మాత్రమే కనిపించే దేవి(అర్చన అయ్యర్) ఎవరు.. ? చివరికి విక్రమ్ తెలుసుకున్న నిజం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.