సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'శతకోటి దండాలు' అంటున్న షకలక శంకర్

ABN, Publish Date - Oct 20 , 2026 | 08:19 AM

Shakalaka Shankar As Lead Shatakoti Dandalu Movie Shoot Wrapped

Shakalaka Shankar

శ్రీ ముత్యం మీడియా (Sri Muthyam Media), నవ్య దివ్య ఆర్ట్స్ (Navya Divya Arts) పతాకంపై కనకల అప్పారావు, విసినిగిరి శ్రీనివాసరావు సంయుక్త సమర్పణలో షకలక శంకర్ (Shakalaka Shankar), జెప్సీ భద్ర (Jepsy Bhadra), మౌనిక (Mounika) హీరో హీరోయిన్లుగా శ్రీ ముత్యం ఇజ్జురొత్తు (Sri Muthyam Ijjurothu) దర్శకత్వంలో, అనసూయ ఇజ్జురొత్తు నిర్మాతగా రూపొందిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం శతకోటి దండాలు (Shatakoti Dandalu). ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు శ్రీముత్యం మాట్లాడుతూ మా షకలక శంకర్ హీరోగా తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ "శతకోటి దండాలు." ఈ చిత్రంలో షకలక శంకర్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. షకలక శంకర్ చేసిన డాన్స్ గానీ, ఆయన చేసిన పెర్ఫార్మన్స్ గాని అదుర్స్ అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రానికి చరణ్ అర్జున్ అందించిన సంగీతం మా సినిమాకు మరొక ఎస్సెట్ గా భావిస్తున్నాను. షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు హైదరాబాద్ రిథమ్ స్టూడియోలో జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు.

Updated Date - Oct 20 , 2026 | 08:19 AM