సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆరు స్ట్రయిట్‌... రెండు డబ్బింగ్ సినిమాలు

ABN, Publish Date - Apr 15 , 2026 | 12:07 PM

ఈ వీకెండ్‌లో 'తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్‌, బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌'తో సహా ఎనిమిది సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో రెండు అనువాద చిత్రాలు ఉన్నాయి.

This weekend movies

ఏప్రిల్‌ థర్డ్ వీకెండ్‌లో ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పకోదగ్గవి మాత్రం కొన్నే. యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌' మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. పలుమార్లు వాయిదా పడిన ఆ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఈ యాక్షన్ మూవీలో నాగశౌర్య సరసన విధి యాదవ్‌ హీరోయిన్‌గా నటించగా, అతని సోదరిగా ఓ కీలక పాత్రను శ్రీదేవి విజయ్‌ కుమార్ చేసింది. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హ్యారిస్ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. రామ్‌ దేశిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. ఇక ఈ శుక్రవారం వస్తున్న మరో సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ప్రముఖ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. వి. మునిరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ కిరణ్‌ అబ్బవరం ప్రొడ్యూస్‌ చేసిన ఈ మూవీలో సాయితేజ్‌, వేద జలంధర్‌, ప్రదీప్‌ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్‌ తదితరులు కీ-రోల్స్ ప్లే చేశారు. గ్రామీణ నేపథ్యం రూపుదిద్దుకున్న ఈ ఎంటర్టైన్ మెంట్‌ మూవీకి విడుదలకు ముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.


ఇటీవల గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులలో తిరువీర్‌ నటించిన 'ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో' చిత్రానికి రెండు అవార్డులు వచ్చాయి. ఉత్తమ తృతీయ చిత్రంగా ఈ సినిమా ఎంపికైంది. అలానే అందులో నటించిన రోషన్‌ రాయ్‌ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యాడు. భిన్నమైన పాత్రలు చేస్తూ, అందరినీ ఆకట్టుకుంటున్న తిరువీర్‌ ఇప్పుడు మరో సినిమాతో జనం ముందుకు శుక్రవారం రాబోతున్నాడు. అదే 'పాపం ప్రతాప్‌'. పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో రాశి, అజయ్‌ ఘోష్‌, అవసరాల శ్రీనివాస్‌, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఎస్.పి. దుర్గ నరేశ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని గడ్డం రాకేష్‌ రెడ్డి, రుద్రదేవ్‌ మధి రెడ్డి నిర్మించారు. ఇక ఇదే 'గాలి, తెరచాప, కాలగమనం' చిత్రాలు సైతం విడుదల అవుతున్నాయి. అలానే తమిళ అనువాద చిత్రం 'మిస్టర్ ఎక్స్'విడుదల కాబోతోంది. ఆర్య, గౌతమ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మను ఆనంద్‌ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్‌ కుమార్ నిర్మించారు. ఇక విషు సందర్భంగా ఈ నెల 15వ తేదీ మలయాళంలో విడుదలైన 'పళ్ళి చట్టంబి' సినిమాను తెలుగులో డబ్ చేసి 17వ తేదీ విడుదల చేయబోతున్నారు.

ఈ వీకెండ్‌లో 'ఓయ్‌, నిన్నుకోరి' చిత్రాలను రీ-రిలీజ్‌ చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు కానీ వాటి అప్‌ డేట్‌ మాత్రం లేదు. ఏదేమైనా.... గత వారం విడుదలైన చిత్రాలలో 'డెకాయిట్‌' మాత్రమే కాస్తంత థియేటర్లలో సందడి చేయగా, ఈ వారంతంలో ఎనిమిది సినిమాలు విడుదల అవుతుండటం విశేషమే.

Updated Date - Apr 15 , 2026 | 02:10 PM