సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AA22XA6: అల్లు అర్జున్-అట్లీ మూవీ.. నుంచి అదిరిపోయే అప్‌డేట్! ఎప్పుడంటే?

ABN, Publish Date - Jan 30 , 2026 | 07:04 PM

'పుష్ప-2' విజయంతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.

AA22XA6

'పుష్ప-2' విజయంతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ (Allu Arjun), ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. మాస్ పల్స్ తెలిసిన కోలీవుడ్ దర్శకుడు అట్లీ (Atlee) తో ఆయన చేతులు కలపడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇది కేవలం ప్రాంతీయ భాషా చిత్రం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకునేలా హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందుతోంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని సరికొత్త సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతున్నారు. హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు అట్లీ టీమ్ చెబుతోంది. ఈ చిత్రం కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారట.

అయితే, తాజాగా ఈ సినిమా గురించి అట్లీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రకటన రానుందని ఆ అప్‌డేట్ అభిమానులందరినీ పూర్తిస్థాయిలో ఖుషీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. అలానే.. 'దీపికా నా లక్కీ ఛార్మ్. జవాన్ తర్వాత ఆమెతో చేస్తున్న రెండో సినిమా ఇది. తల్లైన తర్వాత ఆమె నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో దీపికా చాలా కొత్తగా కనిపిస్తారు, ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది' అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక కల్కి తర్వాత దీపికా నటిస్తున్న మరో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కేవలం దీపికా పదుకొణె (Deepika Padukone) మాత్రమే కాకుండా, మరో ఇద్దరు కథానాయికలకు చోటు దక్కినట్లు సమాచారం. ముఖ్యంగా 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ఈసారి విలన్ షేడ్స్ ఉన్న విభిన్న పాత్రలో కనిపిస్తారనే ప్రచారం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. నటీనటుల ఎంపిక, టెక్నికల్ టీమ్ పనితీరు గమనిస్తుంటే.. ఈ సినిమా సునాయాసంగా 1000 కోట్ల క్లబ్బులో చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్ దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, విడుదల కాకముందే భారీ ధరకు ఓటీటీ డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు అల్లు అర్జున్ స్టైల్ తోడైతే థియేటర్లలో సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. ఇక బన్నీ, అట్లీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం భారతీయ సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెబుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబో వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Jan 30 , 2026 | 07:05 PM