సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీనియర్ హీరోయిన్ రంభ ఇంట విషాదం..

ABN, Publish Date - May 25 , 2026 | 03:46 PM

సీనియర్ నటి రంభ (Rambha) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు.

Rambha

సీనియర్ నటి రంభ (Rambha) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ బాధాకరమైన విషయాన్ని రంభ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. తన తండ్రి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని తెలిపింది.

'ప్రియమైన అప్పా, నా హృదయంలో మీ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని నాకు తెలుసు. మన మధ్య గొడవలు జరిగినా, నేను మీకు ఇబ్బందులు కలిగించినా సరే, మీరు వాటన్నింటినీ ఎప్పుడూ అదే చిరునవ్వుతోనే స్వీకరించారు.మీరు దూరమయ్యాక ఈ ప్రపంచం శూన్యంగా అనిపిస్తోంది. నాన్నా, నేను మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాను.' అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రంభ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - May 25 , 2026 | 04:46 PM