సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జేడీ చక్రవర్తితో గొడవ.. ఎట్టకేలకు నోరువిప్పిన రంభ

ABN, Publish Date - Jun 07 , 2026 | 04:24 PM

ఒకప్పుడు తన అందాలతో కుర్రకారును కైపెక్కించిన అచ్చతెలుగు భామ రంభ (Rambha). స్టార్ హీరోలందరి సరసన నటించిన రంభ ప్రస్తుతం గృహిణిగా సెటిల్ అయ్యింది.

ఒకప్పుడు తన అందాలతో కుర్రకారును కైపెక్కించిన అచ్చతెలుగు భామ రంభ (Rambha). స్టార్ హీరోలందరి సరసన నటించిన రంభ ప్రస్తుతం గృహిణిగా సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు కొన్ని షోస్ కి జడ్జిగా కనిపిస్తోన్న ఆమె రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు సాగిస్తోందని సమాచారం. తాజాగా రంభ ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ముఖ్యంగా హీరో జేడీ చక్రవర్తితో తనకు ఉన్న గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది.


రంభ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో బొంబాయి ప్రియుడు ఒకటి. జేడీ చక్రవర్తి హీరోగా నటించిన ఈ సినిమా వీరిద్దరికి మంచిపేరు తీచుకొచ్చి పెట్టింది. ఆ తరువాత వీరి కాంబోలో కోదండ రాముడు సినిమా వచ్చింది. మొదటి సినిమా నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అయితే రంభ పెళ్లి తరువాత జేడీతో మాట్లాడడం మానేసింది. వీరిద్దరి మధ్య పెద్ద గొడవ అయ్యిందని, అందుకే ఆమె మాట్లాడడం లేదని వార్తలు వచ్చాయి. తాజగా ఆ గొడవపై రంభ మాట్లాడుతూ.. ' జేడీ నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడూ సరదాగా ఉంటూ సెట్స్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేసేవాడు.


అంత క్లోజ్ ఫ్రెండ్ అని నా పెళ్లికి పిలిస్తే రాలేదు. కచ్చితంగా వస్తాడు అనుకున్నాను. కానీ, అలా చేసేసరికి చాలా అప్సెట్ అయ్యాను. ఆ తరువాత కలిసినప్పుడు నా పెళ్లికి రాలేదని చెడామడా తిట్టేసి మాట్లాడడం మానేశాను. జేడీ అన్ని అబద్దాలే చెప్తాడు. నా పెళ్లికి రాకుండా ఏదో అబద్దం చెప్పాడు. అలా కొన్నేళ్లు మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక టెలివిజన్ షోలో ఇద్దరం కలిసి పాల్గొన్నప్పుడు పాత రోజులను గుర్తుచేసుకుంటూ స్టేజ్ పైన ఎంతో ఫన్ క్రియేట్ చేశామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jun 07 , 2026 | 04:31 PM