సేవ్ ది టైగర్స్ 3.. స్క్రిప్ట్ మార్చిన దేవుడు
ABN, Publish Date - May 23 , 2026 | 06:57 PM
ఓటీటీలో సంచలన విజయం సృష్టించిన టాలీవుడ్ పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ (Save The Tigers) మరో సీజన్ రాబోతుంది. పెళ్లిళ్లు, భార్యాబాధల నేపథ్యంలో సాగే హిలేరియస్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా వచ్చిన మొదటి రెండు సీజన్లు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి
ఓటీటీలో సంచలన విజయం సృష్టించిన టాలీవుడ్ పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ (Save The Tigers) మరో సీజన్ రాబోతుంది. పెళ్లిళ్లు, భార్యాబాధల నేపథ్యంలో సాగే హిలేరియస్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా వచ్చిన మొదటి రెండు సీజన్లు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. ఇప్పుడు ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు మూడో భాగంతో రావడానికి సిద్ధమవుతోంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, సీరత్ కపూర్, జోర్దార్ సుజాత, పవని గంగిరెడ్డి, దేవియాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ను మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు.
మొదటి రెండు సీజన్లలో రాహుల్, విక్రమ్ ,ఘంటా రవి ల పాత్రలు ప్రేక్షకులకు విపరీతమైన వినోదాన్ని పంచాయి. ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ మూడవ సీజన్ రాబోతుందని అధికారికంగా తెలిపారు. దాంతో పాటు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈసారి త్రిబుల్ ఫన్.. త్రిబుల్ ఫ్రస్టేషన్ ఉండబోతోందని తెలిపారు. ఇక ఈసారి స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సైతం యాడ్ అయ్యాడు.
'వాళ్ళు దేవుడిని నమ్మారు.. కానీ, దేవుడు స్రిప్ట్ మొత్తాన్ని ఫ్లిప్ చేశాడు అని హింట్ ఇచ్చారు. దేవుడి గెటప్ లో వెన్నెల కిషోర్ కనిపించాడు. ఇక పోస్టర్ లో ఒకప్పుడు పెళ్ళాలు మాట విన్న మొగుళ్ళు.. ఇప్పుడు రివర్స్ లో ఉండడం చూపించారు. అంటే వారు వేరుగా .. వీరు వారుగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. త్వరలోనే టైగర్లు వచ్చే టైమ్ ని టీమ్ అధికారికంగా తెలపనుంది. మరి ఈసారి ఈ ముగ్గురు టైగర్లు ఎలా నవ్విస్తారో చూడాలి.