సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న సత్యదేవ్ జీవిత సత్యాలు..

ABN, Publish Date - May 31 , 2026 | 11:29 AM

సాధారణంగా ఇలాంటి సత్యాలు బాగా వయస్సు మళ్ళినవారు.. ఎన్నో కష్టాలను చూసి చెప్తుంటారు. కానీ, ఈ సత్యాలు చెప్పింది యంగ్ హీరో సత్యదేవ్ (Satyadev). ఎన్ని కష్టాలు ఆయన పడి ఉంటే ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్తాడు అని సోషల్ మీడియాలో సత్యదేవ్ గురించి పెద్ద చర్చ మొదలయ్యింది.

Satyadev

దేవుడు నిన్ను రాజును చెయ్యాలంటే నీకు కిరీటాన్ని ఇవ్వడు యుద్ధాన్ని ఇస్తాడు..

ఎవ్వరైనా సాధిస్తారు.. కానీ, అది అయ్యేవరకు వదలకూడదు..

ఒక పని అవ్వకూడదు అనుకుంటే పదిమందికి చెప్పు.. అవ్వాలి అనుకుంటే నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకో..

సాధారణంగా ఇలాంటి సత్యాలు బాగా వయస్సు మళ్ళినవారు.. ఎన్నో కష్టాలను చూసి చెప్తుంటారు. కానీ, ఈ సత్యాలు చెప్పింది యంగ్ హీరో సత్యదేవ్ (Satyadev). ఎన్ని కష్టాలు ఆయన పడి ఉంటే ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్తాడు అని సోషల్ మీడియాలో సత్యదేవ్ గురించి పెద్ద చర్చ మొదలయ్యింది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ జ్యోతిలక్ష్మీ సినిమాతో హీరోగా మారాడు సత్య. మొదటి సినిమాతోనే మంచి విజయం దక్కినా.. స్టార్ హీరోగా మారడానికి సత్య ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చిరంజీవినే స్వయంగా పిలిచి నీ నటనకు ఫిదా అయ్యాను సత్య అన్నారంటే.. అతని నటన ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


తాజాగా సత్య ఒక పాడ్ కాస్ట్ లో తన మనోగతాన్ని మొత్తం చెప్పాడు. వైజాగ్ లో తన చిన్ననాటి కలలు, స్నేహితులు, చిత్రలహరిలో సాంగ్స్ చూడడం.. కజిన్స్ తో బెట్స్ కట్టడం.. చిరంజీవి అంటే అతనికి ఎంత అభిమానం అనేది చెప్పుకొచ్చాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తాను పడ్డ అవమానాలు, చీదరింపులు.. జ్యోతిలక్ష్మీ సినిమా హీరో అంటే రామ్ గోపాల్ వర్మ వీడు హీరో ఏంటి అని అనడం.. ఆ తరువాత సినిమా చూసి ఆయనే పిలిచి తన నటన గురించి పొగడడం అన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు.


జీవితంలో ఒడిదుడుకులను సమానంగా తీసుకోవాలని సత్య చెప్పుకొచ్చాడు. ఇష్టపడిన డ్రీమ్ కోసం ఎంత కష్టపడినా తప్పు లేదని తెలిపాడు. కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూనే.. తన డ్రీమ్ కోసం సినిమాలు చేసినట్లు తెలిపాడు. ' నాకు భయం వేసింది.. కడుపు కాలితే ఏదైనా చేస్తాం. అందుకే ఒక ప్లాన్ వేసుకున్నా. నా డ్రీమ్ (సినిమా) వదల్లేదు, అలాగని నా ఉద్యోగాన్ని వదల్లేదు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు షూటింగ్ చేసేవాడిని, మళ్లీ సాయంత్రం 6 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జాబ్ చేసేవాడిని. రోజు తినేవాడిని కాదు. ఆ ఒత్తిడి వల్ల రెండు నెలల్లో 16 కేజీలు తగ్గాను'


బ్లఫ్ మాస్టర్ సినిమా రిలీజ్ ముందు వరకు ఈ ఫ్రైడే నాదే అని ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. వరల్డ్ టాప్‌లో ఉన్నట్లు ఫీల్ అయ్యా. కానీ ఆ ఫ్రైడే డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కృష్ణమ్మ థియేటర్లో రిలీజ్ అయిన నెక్స్ట్ గురువారానికే ఓటీటీలోకి వచ్చేసింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రతిసారీ నా అంచనా తప్పింది.. అయినా సరే నమ్మకాన్ని కోల్పోలేదు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడానికి వయసుతో సంబంధం లేదు. దానికి రవితేజనే ఉదాహరణ. రవితేజ అన్నయ్యకు 35 ఏళ్ల వయసులో ఫస్ట్ కమర్షియల్ హిట్ వచ్చింది. అంతవరకు ఆయనకు థియేటర్ హిట్ లేదు. కాబట్టి నాకూ ఒక టైమ్ వస్తుంది. అన్ని ట్రైన్స్ ఒకే సమయానికి రావు, కానీ ఏ ట్రైన్ అయినా దాని టైమ్‌కి వచ్చి డెస్టినేషన్ కి రీచ్ అవుతుంది.


నువ్వొక్కడివే బాత్ రూమ్ లో కూర్చొని ఒక్కడివే ఉన్నప్పుడు నీ హార్ట్ ఏం చేతుందో అది విను.. వందమంది వంద చెప్తారు. నా లైఫ్ లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే.. ఈ పని నీకు అవ్వకూడదు అనుకుంటే పదిమందికి చెప్పు.. అవ్వాలి అనుకుంటే నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకో.. ఎందుకంటే పని అవ్వకుండా వారి మీద నిందలు వేస్తే ఎవరూ పట్టించుకోరు. వాళ్ళను ఎందుకు బ్లేమ్ చేయాలి. గుండె ధైర్యంతో పని మొదలుపెట్టు.. అడుగు వెయ్యి. నువ్వు సక్సెస్ అవుతావు.


గొప్ప గొప్ప విషయాలు జరిగిపోయాక, మనం ఒక పొజిషన్‌కి వచ్చాక ఎవడో వచ్చి గుర్తించక్కర్లేదు. కానీ మనం ఏమీ లేనప్పుడు, జరగకముందే వీడు ఏదో ఒకటి సాధిస్తాడు అని మనల్ని గుర్తించేవాడే లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్. నా జీవితంలో కొంతమంది ఫ్రెండ్స్ అలానే ఉన్నారు. నేను ఏది సాధించనప్పుడు కూడా నాతోనే ఉన్నారు. దేవుడు నిన్ను రాజు చేయాలనుకుంటే కీరిటం ఇవ్వడు.. ముందు యుద్దాన్ని ఇస్తాడు. కీరిటం యుద్ధం గెలిచాక వస్తుంది. ముందు యుద్ధం చేయాలి. లైఫ్ కూడా అంతే. నీకు ఒకటి కావలి అనుకుంటే దేవుడు ముందు అది ఇవ్వడు.. దాని చుట్టూ ఉన్నా యుద్ధాలను ఇస్తాడు. ముందు వాటిని గెలిచి చూపించాలి' అని తెలిపాడు. సత్య మాట్లాడిన ప్రతి వ్యాఖ్య ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది. చాలా బాగా మాట్లాడాడు అంటూ నెటిజన్స్ సత్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Updated Date - May 31 , 2026 | 12:09 PM