సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి వచ్చేస్తున్న రావు బహదూర్..

ABN, Publish Date - Jul 28 , 2026 | 06:33 PM

వర్సటైల్ హీరో సత్యదేవ్ (Satyadev), దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha)కాంబినేషన్‌లో వచ్చిన వైవిధ్యభరితమైన సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ రావు బహదూర్ (Rao Bahadur).

Rao Bahadur

వర్సటైల్ హీరో సత్యదేవ్ (Satyadev), దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha)కాంబినేషన్‌లో వచ్చిన వైవిధ్యభరితమైన సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ రావు బహదూర్ (Rao Bahadur). దీపా థామస్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పించగా.. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి, ఈశ్వరన్ విజయరాఘవన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జూలై 3, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. జూలై 31 నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నెల కూడా తిరక్కుండానే ఈ సినిమా ఓటీటీ బాట పట్టడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


1991 నేపథ్యంలో భువన వంశానికి చెందిన రాజవంశీకుడు రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) లివర్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అతనికి ఉన్న ఒక అనుమానమే అతడిని బతికిస్తూ ఉంటుంది.తన భార్య రేణుక (దీపా థామస్) నమ్మకద్రోహం చేసిందనే బలమైన అనుమానం, భ్రమలతో రావు బహదూర్ తీవ్ర మనోవేదనకు గురవుతుంటాడు. అసలు ఆ అనుమానం ఏంటి.. ? రామప్ప అలా ఉండడానికి కారణం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. థియేటర్ లో మిక్స్డ్ టాక్ అందుకున్న రావు బహదూర్.. ఓటీటీలో ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jul 28 , 2026 | 07:37 PM