సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రతీ సినిమాకు కష్టపడతా.. అయినా రిజల్ట్‌తో నిరాశే: సత్యదేవ్

ABN, Publish Date - Jul 05 , 2026 | 07:06 PM

టాలీవుడ్‌ టాలెంటెడ్ హీరోలలో సత్యదేవ్ ఒకరు. టాలెంట్ ఉన్నా.. ఆయనకు మాత్రం సరైన హిట్ ఇంత వరకు పడలేదనే చెప్పుకోవాలి. ఈ విషయం స్వయంగా ఆయనే పలుమార్లు తెలిపారు.

Hero Satyadev

టాలీవుడ్‌ టాలెంటెడ్ హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. టాలెంట్ ఉన్నా.. ఆయనకు మాత్రం సరైన హిట్ ఇంత వరకు పడలేదనే చెప్పుకోవాలి. ఈ విషయం స్వయంగా ఆయనే పలుమార్లు తెలిపారు. ‘నేను ప్రతి సినిమాకు అంతే కష్టపడతాను. కానీ చాలా వరకు నిరాశే ఎదురైంది’ అని తాజాగా ఆయన ‘రావు బహదూర్’ (Rao Bahadur) మూవీ థ్యాంక్స్ వేడుకలో తెలిపారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ల పై చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సత్య దేవ్, దీపా థామస్ జంటగా నటించారు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో సత్యదేవ్ మాట్లాడుతూ.. ప్రమోషన్స్ టైమ్‌లో ఎవరైనా సరే.. తమ సినిమా గురించి కాస్త ఎక్కువగానే చెబుతుంటారు. కానీ మేము మాత్రం.. ఈ మూవీకి పని చేసినప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో.. అదే ఫీలింగ్‌ను నేను ప్రమోషన్స్‌లో మాట్లాడాను. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మా ‘రావు బహదూర్’ తెలుగు సినిమాకు ఒక ప్రతినిధిగా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఆడియెన్స్ కూడా అదే అంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.


నేను ఇప్పటి వరకు చేసిన ప్రతీ సినిమాకు ఇంతే కష్టపడ్డాను. కానీ చాలా వరకు నిరాశే ఎదురైంది. సక్సెస్ అనేది నాకు ఎప్పుడూ కొత్తే. ‘రావు బహదూర్’తో నాకు సక్సెస్ వచ్చింది అని వినడం కంటే.. ఈ మూవీని చూడకపోతే ఆడియెన్స్ ఏదో కోల్పోతారని అనుకున్నాను. ఇలాంటి సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అనురాగ్, శరత్ అయితేనే మూవీని ముందుకు తీసుకు వెళ్తారని నమ్మాను. మొదట నేను ఈ కథను చాలా మంది హీరోలకు రికమండ్ చేశాను. ఫైనల్‌గా నేనే చేశాను. ఇప్పుడు ప్రేక్షకులు మా చిత్రాన్ని భుజానికి ఎత్తుకుని, మంచిగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా అమెరికన్స్ ఈ సినిమా గురించి అడుగుతున్నారు. ఇలాంటి ఓ గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’

Updated Date - Jul 05 , 2026 | 07:06 PM