వినోదమే ప్రధానంగా సత్యదేవ్ మూవీ!

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:15 PM

సత్యదేవ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా ఓ కొత్త సినిమా బుధవారం మొదలైంది. లక్ష్మీ నారాయణ పుట్టంచెట్టి దర్శకత్వంలో దీనిని బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.

Satyadev New movie

హీరో సత్యదేవ్ (Satyadev) కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి దీనిని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నాయికగా నటిస్తోంది. బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్‌కు డైరెక్షన్ చేశారు.

DSC_1266.jpg.jpeg


ఈ సందర్భంగా వంశీ నందిపాటి (Vamsi Nandipati) మాట్లాడుతూ, 'నా స్నేహితుడు ప్రొడ్యూసర్ నరేంద్ర మరో మంచి చిత్రాన్ని చేస్తున్నారు. హీరో సత్యదేవ్ గారు ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా సాధించబోయే విజయం గురించి తర్వాత మళ్లీ మాట్లాడుతాను. డైరెక్టర్ లక్ష్మినారాయణకు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది' అని అన్నారు. లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ, 'మా సినిమా జానర్ ఏమిటని అందరూ అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. రామ్ మిరియాల మా సినిమాకు మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ గారి కెరీర్‌లో ఇదొక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.

DSC_1301.jpg.jpeg


రామ్ మిరియాల మాట్లాడుతూ, 'మా అందరికీ ఇదొక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సత్య అన్నతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. రెండు పాటలు ఇప్పటికే కంప్లీట్ చేశాం. పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రంలో మ్యూజిక్‌ను మాతో పాటు మీరంతా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను 'వెన్నెల' కిషోర్, వైవా హర్ష, ఎస్ఎస్ కాంచి, సురేష్ గురు తదితరులు పోషిస్తున్నారు.

Updated Date - Feb 18 , 2026 | 04:28 PM