సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స‌త్య స్టెప్పుల‌తో.. ఇర‌గ‌దీశాడుగా...

ABN, Publish Date - Apr 03 , 2026 | 11:27 AM

మ‌త్తువ‌ద‌ల‌రా ఫేం రితేశ్ రాణా ద‌ర్శ‌కత్వంలో క‌మెడియ‌న్ స‌త్య హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం 'జెట్లీ'.

satya

మ‌త్తువ‌ద‌ల‌రా ఫేం రితేశ్ రాణా (Ritesh Rana) ద‌ర్శ‌కత్వంలో క‌మెడియ‌న్ స‌త్య (Satya) హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం 'జెట్లీ'(Jet Lee). మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా (Rhea Singh) క‌థానాయిక‌గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, గ్లింప్స్ మంచి ఆసక్తిని కలిగించడంతో పాటు సినిమా రిలీజ్ కోసం ప్ర‌జ‌లు ఎదురు చూసేలా చేశాయి.

ఈ క్ర‌మంలో తాజాగా మూవీ నుంచి స‌త్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు. సాయి సోమ‌యాజులు (Sai Somayajulu) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా కాల భైర‌వ (Kaala Bhairava) సంగీతంలో శ్రావ‌ణ భార్గ‌వి (Sravana Bhargavi) దీనిని ఆలపించారు. మూవీలో హీరో గుణ‌గ‌ణాల‌ను వ‌ర్ణించుకుంటూ సాగిన ఈ పాట ఆసాంతం హుషారుగా సాగింది. హీరోయిన్ రియా సింగ్ త‌న అందంతో మైమ‌రిపించ‌గా స‌త్య‌ మాత్రం స్టెప్పులు, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అద‌ర‌గొట్టాడు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Apr 03 , 2026 | 01:52 PM