రావ్ బహదూర్ ట్రైలర్.. మహేశ్ బాబు రంగంలోకి దిగాడుగా
ABN, Publish Date - Jun 30 , 2026 | 08:13 PM
సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేశ్ మహా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం రావ్ బహదూర్.
సత్యదేవ్ (Satya Dev), డైరెక్టర్ వెంకటేశ్ మహా (Venkatesh Maha) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం రావ్ బహదూర్ (Rao Bahadur). ప్రారంభం నుంచి ప్రయోగాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అంతేగాక మహేశ్ బాబు (Mahesh Babu) లాంటి సూపర్‌స్టార్ ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తుండడంతో సర్వత్రా అందరి చూపులు ఇప్పడు ఈ చిత్రంపైనే ఉన్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పాటలు, టీజర్ అన్నీ మంచి బజ్ తీసుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించగా మహేశ్ బాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రైలర్ విడుదల చేశారు. నిమిషం 39 సెకండ్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ అసాంతం మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తోనే సాగడం విశేషం.
అంతేగాక సినిమా థీమ్‌ను వివరిస్తూ తెలుగులో మొట్ట మొదటి సారిగా ఓ విభన్న చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నట్లు తెలిపి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఇక.. ట్రైలర్‌ను చూస్తే సత్యదేవ్ తన నట విశ్వరూపం ప్రదర్శించినట్లు కాన వస్తోంది. మీరూ ఈ ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి మరి.