సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satvika Veeravalli: టాలీవుడ్ లో ఈ తార ఒక వెలుగు వెలిగేలా ఉందే

ABN, Publish Date - Nov 20 , 2026 | 03:40 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది.. ఆమె మరెవరో కాదు యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సాత్విక వీరవల్లి (Satvika Veeravalli). 

Satvika Veeravalli

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది.. ఆమె మరెవరో కాదు యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సాత్విక వీరవల్లి (Satvika Veeravalli).  ఆకాశంలో ఒక తార సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు, ఈ శుక్రవారం విడుదలైన తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆకాశంలో ఒక తార సినిమా థియేటర్లలోకి రాకముందే సాత్విక ఇండస్ట్రీలో ఫుల్ బిజీ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్, రషెస్ చూసిన స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు ఆమెకు వరుసగా బంపర్ ఆఫర్లు ఇచ్చారు. మొదటి సినిమా విడుదలయ్యే సమయానికే ఏకంగా మూడు భారీ క్రేజీ ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.


ప్రస్తుతం సాత్విక చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. అందులో ఒకటి అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NC 25. బెదురులంక సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్లాక్స్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాత్విక హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్.  దీనికి తోడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న జాకీ’ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పాన్-ఇండియా సెన్సేషన్ RC 17లో కూడా సాత్విక ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపికైనట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టి ప్రచారం జరుగుతోంది.కెరీర్ ప్రారంభంలోనే ఇంతటి భారీ అవకాశాలు అందుకోవడం సాత్విక అదృష్టంతో పాటు ఆమె టాలెంట్‌కు నిదర్శనమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకాశంలో ఒక తార విజయోత్సాహంలో ఉన్న ఈ తెలుగమ్మాయి, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో టాప్  హీరోయిన్‌గా ఎదిగి ఒక వెలుగు వెలగడం ఖాయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాలతో సాత్విక ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 20 , 2026 | 03:40 PM