సత్తిబాబు పరలోకయాత్ర బావుంటుందంటున్న సంతోష్ శోభన్
ABN, Publish Date - Sep 15 , 2026 | 10:11 PM
యువ నటుడు సంతోష్ శోభన్ బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన, ఏకగ్రీవ హిట్ కోసం ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌లో పలు సినిమాలు చేసిన ఆయన, ఈసారి ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
యువ నటుడు సంతోష్ శోభన్ (Santhosh Sobhan) బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన, ఏకగ్రీవ హిట్ కోసం ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌లో పలు సినిమాలు చేసిన ఆయన, ఈసారి ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ యువి క్రియేషన్స్ సంస్థలోనే మరొక సరికొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
కపుల్ ఫ్రెండ్లీ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సంతోష్ శోభన్, దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ నయా చిత్రానికి సత్తిబాబు పరలోకయాత్ర అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఖరారు చేశారు. యువి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. పోస్టర్ లో సంతోష్ శోభన్ గాగుల్స్ పెట్టుకున్నాడు. అందులో ఒక దాంట్లో చర్చిని.. ఇంకో దాంట్లో గుడిని చూపించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన కథానాయికలుగా ప్రీతి అస్రాని, మానస చౌదరి నటిస్తున్నారు.
టాలీవుడ్‌లోనే తొలిసారిగా మల్టీవర్స్ కామెడీ జోనర్‌లో ఈ సినిమాను మలుస్తుండటం విశేషం. సమాంతర లోకాలు, పరలోకం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక రైడ్‌గా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై కామెడీ అంచనాలు మరింత పెరిగాయి. ఒక కొత్త తరహా ప్రయోగంగా, విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ కామిక్ ఎంటర్‌టైనర్ ఈ డిసెంబర్ సెలవుల కానుకగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఫుల్ ఫన్ అండ్ ప్రయోగాత్మక కథాంశంతో వస్తున్న ఈ సత్తిబాబు పరలోకయాత్ర సంతోష్ శోభన్‌కి ఆశించిన హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.